భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి అతని బ్యాటింగ్ కాదు, కొత్త హెయిర్ స్టైల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన వారం రోజుల్లోనే కోహ్లీ పాస్టెల్ రంగులో కొత్త హెయిర్ కలర్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు.

ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ రషీద్ సల్మానీ ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ కొత్త లుక్ వీడియోను షేర్ చేస్తూ “King Kohli, now in pastels” అని క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

అయితే, ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ పై జరిగిన మ్యాచ్‌లో హామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా కోహ్లీ భారత్-ఆఫ్ఘానిస్థాన్ మూడు వన్డేల సిరీస్‌కు దూరమయ్యాడు. గాయం ఉన్నప్పటికీ ఫైనల్లో అజేయంగా 75 పరుగులు చేసి ఆర్సీబీకి వరుసగా రెండో టైటిల్ అందించాడు.