మొబైల్ గేమింగ్ ప్రపంచాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు చైనా టెక్ బ్రాండ్ REDMAGIC సరికొత్త గేమింగ్ టాబ్లెట్‌ను ఆవిష్కరించింది. తాజాగా విడుదలైన REDMAGIC Gaming Tablet 5 Pro, హై-ఎండ్ గేమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.
ఈ టాబ్లెట్‌లో 3 నానోమీటర్ టెక్నాలజీపై రూపొందిన Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌తో పాటు Red Core R4 Gaming Chip ఉంది. 9.06 అంగుళాల 2.4K OLED డిస్‌ప్లే, 185Hz రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో సూపర్ స్మూత్ గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
ఇందులో పరిశ్రమలో తొలిసారిగా Active Liquid Cooling Systemను అందించారు. దీంతో గంటల తరబడి గేమింగ్ చేసినా డివైస్ వేడెక్కకుండా ఉంటుంది.
8300mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ USB Type-C పోర్టులు, బైపాస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. Android 16 ఆధారిత RedMagic OS 11.5తో పాటు MORA AI Agent 2.0 గేమింగ్‌ను మరింత స్మార్ట్‌గా మారుస్తుంది.
చైనాలో ఈ టాబ్లెట్ ధర సుమారు రూ.73,800 నుంచి రూ.97,500 వరకు ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో REDMAGIC Astra 2 పేరుతో జూలై 17న విడుదల కానుంది. గేమింగ్‌ను సీరియస్‌గా తీసుకునే వారికి ఇది ఒక పవర్‌ఫుల్ ఆప్షన్‌గా నిలవనుంది.










