ఉత్తరాఖండ్‌లోని అల్మోరాకు చెందిన యువ ఇన్నోవేటర్ రవి తామ్టా తన స్టార్టప్ HAPIDA SKY అభివృద్ధి చేసిన HAPIDA SKYNeX ఎలక్ట్రిక్ పర్సనల్ ఫ్లయింగ్ వెహికల్‌ను విజయవంతంగా టెస్ట్ ఫ్లైట్ నిర్వహించారు. పూర్తిగా విద్యుత్‌తో నడిచే ఈ ఫ్లయింగ్ వెహికల్ ప్రస్తుతం ప్రోటోటైప్ దశలో ఉంది.
భవిష్యత్‌లో వ్యక్తిగత ఎయిర్ ట్రావెల్‌ను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు రవి తామ్టా తెలిపారు. అయితే ఇది వాణిజ్యపరంగా అందుబాటులోకి రావాలంటే మరిన్ని ఇంజినీరింగ్ పరీక్షలు, భద్రతా ప్రమాణాల పరిశీలనలు, అలాగే ప్రభుత్వ అనుమతులు పొందాల్సి ఉంది. ఈ విజయవంతమైన టెస్ట్ ఫ్లైట్ భారతీయ ఏరోమొబిలిటీ రంగంలో మరో ముందడుగుగా భావిస్తున్నారు.












