ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ Spotify తాత్కాలికంగా సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది. యాప్ సరిగా పనిచేయడం లేదని, మ్యూజిక్ ప్లే కావడం లేదని, లాగిన్ సమస్యలు వస్తున్నాయని అనేక మంది యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యూజర్ రిపోర్టుల ప్రకారం యాప్ క్రాష్ అవడం, ప్లేబ్యాక్ సమస్యలు వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఈ సమస్యకు కారణం ఏమిటన్నదిపై Spotify నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ అంతరాయం తాత్కాలికమేనని, త్వరలో సేవలు సాధారణ స్థితికి వస్తాయని భావిస్తున్నారు.