వాట్సాప్‌లో ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్ ద్వారా ఇతరులతో కనెక్ట్ అయ్యే ప్రతిపాదిత ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేయడంతో, మెటా ప్రతినిధులు కేంద్ర ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతిక శాఖ (MeitY) అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో యూజర్‌నేమ్ ఫీచర్ వల్ల సైబర్ మోసాలు, నకిలీ గుర్తింపులు (ఇంపర్సనేషన్), ఫిషింగ్ వంటి నేరాలు పెరిగే అవకాశం ఉందన్న అంశాలపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఫీచర్‌కు సంబంధించిన భద్రతా ప్రమాణాలు, వినియోగదారుల రక్షణ చర్యలు, దుర్వినియోగాన్ని నివారించే విధానాలపై పూర్తి వివరాలతో మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం మెటాను కోరింది.
ప్రభుత్వం పరిశీలన పూర్తయ్యే వరకు ఈ ఫీచర్‌ను భారత్‌లో అమలు చేయవద్దని కూడా సూచించినట్లు సమాచారం. వినియోగదారుల భద్రతకు ఎలాంటి ప్రమాదం లేకుండా తగిన రక్షణ చర్యలు అమలు చేసిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు.
మెటా మాత్రం ఈ ఫీచర్ ఇంకా పూర్తిస్థాయిలో విడుదల కాలేదని, దశలవారీగా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలిపింది. వాట్సాప్ ఖాతా సృష్టించడానికి ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఉంటుందని, యూజర్‌నేమ్ ఫీచర్ కోసం అదనపు భద్రతా వ్యవస్థలు, నకిలీ ఖాతాలను నిరోధించే చర్యలు, ప్రముఖ వ్యక్తుల పేర్ల రక్షణ వంటి అంశాలను అమలు చేస్తున్నామని సంస్థ వివరించింది.
భారత్‌లో డిజిటల్ భద్రత, వినియోగదారుల గోప్యతకు సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్ అమలుపై తుది నిర్ణయం ప్రభుత్వం, మెటా మధ్య జరిగే తదుపరి చర్చల అనంతరం వెలువడే అవకాశం ఉంది.












