అమెరికాలోని OpenAI మరో కీలక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ChatGPT Pro యూజర్ల కోసం కొత్తగా “Finances” టూల్స్‌ను ప్రివ్యూ రూపంలో ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డులు, ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్లను నేరుగా ChatGPTతో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందుకోసం OpenAI, ఫైనాన్షియల్ కనెక్షన్ సర్వీస్ Plaid తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Schwab, Fidelity, Chase, Robinhood, American Express, Capital One వంటి 12 వేలకుపైగా ఫైనాన్షియల్ సంస్థలకు సపోర్ట్ అందుబాటులో ఉంది. అకౌంట్లు కనెక్ట్ చేసిన తర్వాత ఖర్చులు, సబ్‌స్క్రిప్షన్లు, రాబోయే బిల్లులు, పెట్టుబడుల పనితీరు వంటి వివరాలను ChatGPTలోనే చూడొచ్చు. ఇక “@Finances, connect my accounts” అని టైప్ చేస్తే చాట్‌బాట్ స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తుంది. త్వరలో Intuit సపోర్ట్ కూడా తీసుకురానున్నట్లు OpenAI వెల్లడించింది.