
మేషం
మేష రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది ప్రతి ఉద్యోగాలపరంగా చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఒక శుభవార్త వింటారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. దూరపు బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. విదేశాలలో ఉన్నవారు విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్న వారు ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది. వృత్తి ఉద్యోగ విషయాల్లో అధికారులతో చర్చలు సఫలమౌతాయి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 6 వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
వృషభం
వృషభ రాశి వారికి చాలావరకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. వ్యక్తి ఉద్యోగాలపరంగా మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కాకుండా సొంతంగా చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు చేసేవారు ప్రతి పనిని ప్రతి విషయాన్ని దగ్గరుండి క్షుణ్ణంగా పరిశీలించుకోవడం మంచిది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. హోటల్ రంగంలో ఉన్న వారికి వ్యాపార రంగంలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. ముఖ్యమైన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. శ్రావణమాసం ప్రారంభం కాబోతుంది కావున ఓం నమో నారాయణ వత్తులతో లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. ఈ శ్రావణ మాసంలో చేసే పూజలు వ్రతాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున విలువైన వస్తువుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. దైవ చింతన పెరుగుతుంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో ధూపం వేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మిధునం
మిధున రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కార్యాలయంలో సహా ఉద్యోగులతో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. చాలాకాలం నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి. కెరియర్ పరంగా స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పునర్వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వారాంతంలో మంచి సంబంధం కుదురుతుంది. మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు. సుబ్రహ్మణ్యస్వామి వారికి అభిషేకం చేయించండి. చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు తప్పవు. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. కోపానికి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రావణమాసం రాబోతుంది కావున ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. అలాగే ఉదయం సాయంత్రం కుబేర కుంకుమ మొగలి పువ్వు కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి వారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాలలో సొంత నిర్ణయాలు శ్రేయస్కరం. బంధు వర్గంతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. సంతాన పరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి అనుకూలత పెరుగుతుంది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా అమ్మవారికి ఈ శ్రావణమాసంలో మొగలి పువ్వు కుంకుమ ఆరావళి కుంకుమతో అష్టోత్తరంతో పూజ చేయండి. ఓం నమో నారాయణ వత్తులతో లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. కుటుంబ వ్యవహారాలలో మీ నిర్ణయాలు అందరికి నచ్చే విధంగా ఉంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
సింహం
సింహ రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి చిన్నచిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగ పరంగా ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ప్రభుత్వ పరంగా రావలసినటువంటి ధనం చేతికందుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రారంభించిన పనులలో జాప్యం కలుగుతుంది. మనోధైర్యం కలిగి ఉంటారు. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ఇంటా బయట దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. దైవ చింతన కలుగుతుంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ఓం నమో నారాయణా వత్తులతో లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. అదేవిధంగా ఈ శ్రావణమాసంలో ఉదయం సాయంత్రం ఆరావళి కుంకుమ కుబేర కుంకుమతో అష్టోత్తరంతో అమ్మవారికి పూజ చేయండి. నిరాశ వారికి కలిసి వచ్చే సంఖ్య 9 కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కన్య
కన్యా రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. నలుగురిలో ప్రత్యేకంగా కనపడడానికి ఎక్కువగా కష్టపడతారు. అలంకార వస్తువుల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సంతానం యొక్క విద్యా విషయాలకు ధనం అధికంగా ఖర్చవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటాబయటా సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. నిరాశవారు ప్రతిరోజు ఓం నమో నారాయణా వత్తులతో లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. వృత్తి వ్యాపారాలలో నష్టాలు అధిగమించి లాభాలు పొందుతారు. ఉద్యోగమున అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన గృహం కొనుగోలు చేస్తారు. వాహన యోగం ఉంది. మీ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
తుల
తులా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. ఏదైనా నూతన పెట్టుబడి పెట్టేటప్పుడు మీకు మీరుగా సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే మీరు సొంతంగా చేసే వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి. కీలక వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వ్యాపారాల్లో ఆదాయ వేలు సమానంగా ఉంటాయి. ఈ శ్రావణమాసంలో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఓం నమో నారాయణ భక్తులతో లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి అలాగే కుబేర కుంకుమతో ఆరావళి కుంకుమతో అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా రెండు కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నర దిష్టి అధికంగా ఉంటుంది మెడలో కాలభైరవ రూపు ధరించండి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆకస్మిక ధన లాభం సూచిస్తుంది. ధనాదాయ మార్గలు పెరుగుతాయి. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థిని విద్యార్థులకు కాలమనుకూలంగా ఉంది. దీర్ఘాకాలిక ఋణాలు తీర్చగలుగుతారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. శ్రావణమాసం ప్రారంభం కాబోతుంది కావున అమ్మవారికి కుబేర కుంకుమ ఆరావళి కుంకుమతో అష్టోత్తరంతో అమ్మవారికి పూజ చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
ధనస్సు
ధనస్సు రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు. రావలసిన ధనం చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో నూతన ఒప్పందాలు సఫలీకృతం అవుతాయి. చుట్టుపక్కల వారితో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశి వారు ప్రతిరోజు కూడా కుబేర కుంకుమతో ఆరావళి కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన చేయండి. ఓం నమో నారాయణ వత్తులతో లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలపరంగా ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మకరం
మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల బడతాయి. ఆరోగ్యపరంగా ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు సమస్య పోతాయి. వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంటుంది. నలుగురిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఒక స్థిరాస్తిని అమ్మి వేసి అప్పులు తీర్చాలని ఆలోచన చేస్తారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గృహనిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. శ్రావణమాసం ప్రారంభం కాబోతుంది కావున అమ్మవారికి ప్రతిరోజు కుబేర కుంకుమతో ఆరావళి కుంకుమతో మొగలి పువ్వు కుంకుమతో ప్రతిరోజు కుంకుమార్చన చేయండి. సంతాన ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. మీరు రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు గ్రీన్. ఇదే నా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కుంభం
కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో మాత్రం తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు కష్టానికి తగిన ప్రతిఫలం అంతంత మాత్రమే ఉంటుంది. అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బందిపడతారు. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ధనం విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. మీరు ఎప్పుడూ కొనుక్కోలు చేస్తున్న స్థిరాస్తులు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. ప్రస్తుత పరిస్థితులలో ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉన్న స్థిరాస్తులు నమ్మకుండా ఉండటం మంచిది. కొందరి ప్రవర్తన మానసికంగా మరింత చికాకు పరుస్తుంది. సంతానం యొక్క విద్యా విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు శని గ్రహ స్తోత్రం చదవండి ఆంజనేయ స్వామి వారికి వనమాల సమర్పించండి. శ్రావణమాసం రాబోతుంది కావున శ్రావణమాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆరావళి కుంకుమతో మొగలిపువ్వు కుంకుమతో అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఇదేనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మీనం
మీన రాశి వారికి వారం చాలావరకు అనుకూలంగా ఉంది. నిరాశవారికి ఏలిన నాటి శని నడుస్తుంది. మీరు తలపెట్టిన కార్యక్రమం సఫలీకృతం అవుతుంది. వైద్యుత్తులో ఉన్న వారికి వ్యాపార రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. మధ్యవర్తి సంతకాలకు దూరంగా ఉండండి. తొందరపడి ఎవరికి వాగ్దానం చేయవద్దు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. దానం ఖర్చు విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంతాన సంబంధించి విద్యా విషయాలు బాగున్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి. మరి సొంతంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. శ్రావణమాసం ప్రారంభం కాబోతుంది కావున ఈ శ్రావణమాసంలో ప్రతిరోజు ఆరావళి కుంకుమతో కుబేర కుంకుమతో అష్టోత్తరంతో అమ్మవారికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ చేయండి. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ భక్తులతో లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. మీ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.









