
అఖిల్ అక్కినేని హీరోగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా.. విడుదలైన 20 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసి అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అఖిల్ అక్కినేని ‘లెనిన్’ సినిమాతో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ క్రాస్‌చేసి, అందరినీ లాభాల బాట పట్టించింది. తాజాగా ఈ మైల్‌స్టోన్ క్లబ్‌లో చేరింది. ‘లెనిన్’ సినిమా జులై 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలిరోజే రూ.16.7 కోట్ల భారీ గ్రాస్ రాబట్టింది. మొదటి నాలుగు రోజుల్లో ఏకంగా రూ.67.2 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఈ మూవీ.. 10 రోజుల్లో రూ.88 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లుగా అధికారికంగా ప్రకటించారు. 20 రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఇక అఖిల్ సరసన భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా ప్రమోద్, శివాజీ, బ్రహ్మాజీ, ఈశ్వరి రావు, శత్రు తదితరులు నటించారు. అన్నపూర్ణ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నాగార్జున అక్కినేని, నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు











