
హైదరాబాద్: కల్తీ మసాలాల కేసుల్లో ముగ్గురిని అరెస్టు చేశామని హైదరబాద్ పోలీసు కమిషనర్ సిపి సజ్జనార్ తెలిపారు. సోదాలు నిర్వహించి 25 టన్నులకు పైగా కల్తీ మసాలాలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. హైదరాబాద్ లో కల్తీ మసాలాల తయారీ కేంద్రాలపై హెచ్ ఫాస్ట్ మెరుపు దాడులు చేసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 13 మసాలా వ్యాపార, ప్రాసెసింగ్ కేంద్రాల్లో తనిఖీ చేశామని, మైలార్ దేవ్ పల్లి, బాలాపూర్ పిఎస్ లో మూడు కేసులు నమోదు చేశామని సిపి సజ్జనార్ తెలియజేశారు. జీలకర్ర, లవంగం, షాజీరా, ఆవాలు సహా పలు మసాలాల్లో కల్తీ గుర్తించామని, ఆహార భద్రత చట్టం కింద నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి సజ్జనార్ పేర్కొన్నారు.








