
ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దుకు ముఖ్యమంత్రి కుట్ర
జీఓ నెంబర్ 7 పేరిట చీకటి ఉత్తర్వులు వెంటనే వెనక్కి తీసుకుని
విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి
లేకపోతే మీరు, మంత్రులు రోడ్లపై తిరగలేరు
సిఎం రేవంత్‌రెడ్డికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 14 లక్షల మం ది విద్యార్థులకు సిఎం రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రద్దు చేసేందుకే చీకటి జిఒ 7 ను తీసుకొచ్చారని మండిపడ్డారు. విద్యాశాఖను విధ్వం సం చేసేందుకే నీ దగ్గర పెట్టుకున్నావా అని నిలదీశారు. దుర్మార్గమైన జిఒ 7ను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాప ణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థుల తో కలిసి రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సిఎం, మంత్రులు రోడ్లపై తిరగలేరని హెచ్చరిస్తూ ఆదివారం సిఎం రేవంత్ రెడ్డికి కెటిఆర్ ఘాటు లేఖ రాశా రు.
రాష్ట్రంలోని 14 లక్షల మంది బిసి, ఎస్‌సి,ఎస్‌టి, మై నారిటీ విద్యార్థులకు కొండంత అండగా నిలిచే ఫీజు రీ యింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దుచేసేలా చేస్తున్న కుట్ర భ యంకరమైనదని పేర్కొన్నారు. ఈ జిఒ వచ్చిన క్షణం నుం చి విద్యార్థులకే కాదు, లక్షలాది మంది నిరుపేద తల్లిదండ్రులకు కూడా కంటి మీద కునుకు కరువైందని అన్నారు. ఇప్పటికే గురుకుల వ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చడంతో 142 మందికి పైగా చందమామల్లాంటి పిల్లలు తనువు చా లించారని, కనీసం సరైన భోజనం కూడా కల్పించలేని చే తకాని సర్కారు వల్ల ఇప్పటికీ వేలాది మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతూనే ఉన్నారని అన్నారు. ఉమ్మడి రా ష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మం చి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రాజకీయాలకు అతీతంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా కొనసాగించారని గుర్తు చేశారు.
విజిలెన్స్ దాడుల పేరిట కళాశాలలకు బెదిరింపులు
రాష్ట్రవ్యాప్తంగా 2500కు పైగా నడుస్తున్న ఉన్నత విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఒక్క పైసా చెల్లించకుండా రెండున్నరేళ్లుగా తీవ్ర వేధింపులకు గుర్తి చే శారని మండిపడ్డారు. బాకీల చెల్లింపు విషయంలో వన్ టై మ్ సెటిల్‌మెంట్ పేరిట కొంతకాలం, ట్రస్ట్, టోకెన్ల పేరిట ఇంకొంత కాలం కమిటీల పేరిట మరికొన్ని రోజులు మ భ్యపెట్టారని అన్నారు. చివరికి అసలుకే ఎసరు తెచ్చిన కాంగ్రెస్ దివాళాకోరు విధానాన్ని చూసి విద్యార్థి లోకం తీ వ్రంగా అసహ్యించుకుంటోందని విమర్శించారు. పెద్దఎత్తున బకాయిలు పేరుకుపోవడంవల్ల కళాశాలలు నడపలే క యాజమాన్యాలు బంద్ పాటిస్తే, ప్రభుత్వ చేతకానితనా న్ని కప్పిపుచ్చుకునేందుకు విజిలెన్స్ దాడుల పేరిట కళాశాలలపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. చివరికి 1207 కోట్ల విడుదల పేరిట ఇచ్చిన టోకెన్లకు నేటికీ దిక్కులేకుండా పోయిందని పేర్కొన్నారు. గత 30 నెలల్లో మూడు పైసలు కూడా విడుదల చేయని కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు విద్యార్థుల ఖాతాలో నేరుగా ఫీజులు జమవేస్తామంటే ఎవరు నమ్ముతారు..? అని ప్రశ్నించారు.
పేద విద్యార్థులతో కలిసి సమరశంఖం పూరిస్తాం
ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా తెచ్చిన చీకటి జీఓను వెన క్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు సిఎం రేవంత్‌రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని బిఆర్‌ఎస్ పార్టీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలో ఉన్న 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పేద విద్యార్థులతో దండుకట్టి కాంగ్రెస్ సర్కారుపై సమరశంఖం పూరిస్తామని వెల్లడించారు. ఇప్పటికే అన్నదాతల ఆందోళనలతో అట్టుడుకుతున్న రాష్ట్రంలో దగాపడ్డ విద్యార్థులు గర్జిస్తే మీరు, మంత్రులు రోడ్లపై తిరగలేరని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.













