
ఐపిఎల్ 2026లో భాగంగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడబోతున్నాయి. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇరుజట్ల మధ్య కీలక పోరు జరగనుంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. చెరో తొమ్మిది మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ, చెన్నై.. నాలుగేసి విజయాలు సాధించాయి. ఈ మ్యాచ్ లో గెలుపొంది తమ స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోవాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి.















