
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బిజెపి సంఖ్యా బలం ఇప్పుడు 207కు చేరుకుంది. తిరిగి ఓట్ల లెక్కింపు జరిగిన రాజర్హట్ న్యూ టౌన్‌లో కూడా బిజెపి గెలిచింది. దీనితో రాష్ట్రంలో తిరుగులేని మెజార్టీ పొందిన బిజెపి మరింత బలోపేతం అయింది. అక్కడ జరిగిన ఎన్నికలలో బిజెపికి చెందిన పియూష్ కనోడిచా సమీప టిఎంసి అభ్యర్థి, రెండుసార్లు ఎమ్మెల్యే అయిన తపష్ చౌదరిపై కేవలం 309 స్వల్ప మెజార్టీతో ఓడించినట్లు ప్రకటించారు. దీనితో సోమవారం బిజెపికి ఉన్న సంఖ్యాబలం 206 ఇప్పుడు 207 అయింది












