
ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి ఇకలేరు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. ఉదయ్ పూర్ లోని స్వస్థలానికి వెళ్తుండగా కారు ప్రమదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఆర్. బి. చౌదరి ఒక ప్రముఖ సినీ నిర్మాత సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ ద్వారా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తొంభైకి పైగా సినిమాలు నిర్మించారు. తెలుగులో సూర్యవంశం, సుస్వాగతం, రాజా, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా వంటి అనేక విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. చిత్రపరిశ్రమలో ఆయన మరణం తీవ్ర విషాదాన్ని నింపింది.













