మన తెలంగాణ/హైదరాబాద్: ఉద్యోగుల ఈ హెచ్‌ఎస్ పథకం వచ్చేనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. వారం రోజుల్లో విధి, వి ధానాలను ప్రకటిస్తామని సిఎస్ ఉద్యోగ సం ఘాల నేతలకు హామీనిచ్చారు. దీనికి సంబంధించిన సిఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన శనివారం సాయంత్రం ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్ర స్ట్ సభ్యులతో చర్చలు జరిపారు. భార్యాభర్తల్లో ఒకరి నుంచి మాత్రమే చం దాను మినహాయించాలని ఉద్యోగ సంఘాల నాయకులు సిఎస్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సిఎస్ కూడా అంగీకారం తెలిపారు. గతంలో అదనంగా కట్ అయిన చందాను తిరిగి చెల్లించడానికి ఉత్తర్వు లు జారీ చేస్తామని సిఎస్ పేర్కొన్నారు.

వారం రోజుల్లో ఆస్పత్రులు యాజమాన్య ప్రతినిధు లు, ఆరోగ్య శాఖ అధికారులు, ట్రస్ట్ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తామని సిఎస్ పేర్కొన్నారు. తదుపరి సమావేశంలో ఫ్యాకేజీ రేట్లు, ఆస్పత్రుల జాబితాపై చర్చించి వెంటనే విడుదల చేస్తామని సిఎస్ ఉద్యోగ సంఘాల నాయకులతో పేర్కొన్నారు. ఈహెచ్‌ఎస్‌లో ఉన్న గైడ్‌లైన్స్‌ను ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేస్తారు. ఈ సమావేశంలో ఏలూరి శ్రీనివాస రావు, మారం జగదీశ్వర్, దామోదర్ రెడ్డి, సదానంద గౌడ్, దాస్యానాయక్, చావ రవి, లచ్చిరెడ్డి, ఉమాదేవి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.