రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 16వ తేదీన ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టర్ సముదాయ భవనాన్ని ప్రారంభించి, పైలాన్‌ను ఆవిష్కరించడంతో పాటు హెచ్‌ఏఎమ్ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి నేరుగా జిల్లాలోని ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారానికి చేరుకొని సమ్మక్క- సారలమ్మలను దర్శించుకున్న అనంతరం రూ.250 కోట్లతో చేపట్టిన ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి పనులను సిఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా రాష్ట్ర మంత్రి సీతక్క బుధవారం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన నిర్వహించి, అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో నూతన కలెక్టర్ కార్యాలయ భవన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా త్వరలోనే ముఖ్యమంత్రి జిల్లాకు రానున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు.