
షియోమీ 17 మ్యాక్స్ చైనాలో విడుదలైంది. ఈ పరికరం షియోమీ 17 లైనప్‌లో ఐదవ మోడల్‌గా నిలిచింది. షియోమీ 17 మ్యాక్స్ మోడల్‌లో, లైనప్‌లోని ఇతర స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే అదే ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8-సిరీస్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇది లైకా-ట్యూన్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ ధర ఎంత, ముఖ్య ఫీచర్లు గురించి తెలుసుకుందాం.
షియోమీ 17 మ్యాక్స్ ధర
ఈ సరికొత్త షియోమీ స్మార్ట్‌ఫోన్ నాలుగు స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి
12GB + 256GB వేరియంట్ ధర CNY 4,799 (సుమారుగా రూ. 68,000)
16GB + 256GB వేరియంట్ ధర CNY 5,099 (సుమారుగా రూ. 72,000)
12GB + 512GB వేరియంట్ ధర CNY 5,399 (సుమారుగా రూ. 76,000)
16GB + 512GB వేరియంట్ ధర CNY 5,799 (సుమారుగా రూ. 82,000).
ప్రస్తుతం ఈ పరికరం చైనాలో ప్రీ- ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది.మే 25 నుంచి ఆన్లైన్ స్టోర్ ద్వారా సేల్ కు రానుంది. ఈ ధర వద్ద భారత మార్కెట్లో విడుదల చేస్తే, ఇది ఐఫోన్ 17, శాంసంగ్ S25 ప్లస్ వంటి మోడళ్లకు పోటీ ఇస్తుంది.
షియోమీ 17 మ్యాక్స్ ఫీచర్లు
ఈ డ్యూయల్-సిమ్ ఫోన్‌లో 6.9-అంగుళాల 1.5K (1,200×2,608 పిక్సెల్స్) ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. దీనికి 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, 3500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్, HDR వివిడ్, HDR10+ సపోర్ట్, డాల్బీ విజన్, డ్రాగన్‌క్రిస్టల్ 3.0 ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.ఈ హ్యాండ్‌సెట్ 3nm ప్రాసెస్‌పై నిర్మించిన, 4.6GHz క్లాక్ స్పీడ్ గల స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. భద్రత కోసం 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందించారు.
కెమెరా సెటప్‌లో లైకా-ట్యూన్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో OISతో కూడిన 200-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. దీనితో పాటు 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, దానికి జతగా 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉన్నాయి. ముందువైపు 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.
బ్యాటరీ పరంగా, ఈ ఫోన్‌లో 8000mAh బ్యాటరీతో 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. డస్ట్ అండ్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్ కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. కనెక్టివిటీ ఆప్షన్లలో Wi-Fi 7, 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, NFC, ఒక USB టైప్-C పోర్ట్, GPS, GLONASS, QZSS, NavIC వంటి ఫీచర్లను కలిగి ఉంది.












