
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారంనాడు జరిగిన కేబినేట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ.4.5 లక్షల కోట్ల విలువైన పథకాలు, ప్రా జెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సమావేశానంతరం ఆ వివరాలను కేంద్ర మంత్రి అశ్వి ని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. వివిధ ప్రా జెక్టులు, పథకాల కింద కేబినెట్ రూ.4,50,98 8 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపిందని చెప్పారు. దేశంలో చమురు, సహజవాయువుల అన్వేషణ, ఉత్పత్తిని వేగం చేసే లక్ష్యంతో రూ.84,084 కోట్ల వ్యయంతో రూపొందించిన ‘సముద్ర మంధన్- ది నేషనల్ ఆఫ్‌షోర్ ఎక్స్‌ప్లోరేషన్ స్కీమ్’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ మొత్తాన్ని 2030-31 వరకూ వినియోగించనున్నట్టు చెప్పా రు.
ఈ పథకం ద్వారా భారత్ హైడ్రోకార్బన్ నిల్వలకు 600 మిలియన్ టన్నుల చమురు సమాన పరిమాణం (ఎంఎంటీఓఈ) కంటే ఎక్కువ నిల్వలు అదనంగా చేరే అవకాశం ఉందన్నారు. సముద్ర ప్రాంతాల్లో చమురు, సహజవాయువు అన్వేషణ కార్యకలాపాలు పెరగడం, దేశీయ ఉత్పత్తి గణనీయంగా పెరగడం, పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయని వివరించారు. చమురు, సహజవాయువుల అన్వేషణ నుంచి ఉత్పత్తి వరకూ ఉన్నవిలువ గెలుసులో ఈ పథకం భారీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందని చెప్పారు. తద్వారా పరిశ్రమల అభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని అన్నారు.
కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ మరో ఐదేళ్లు పొడిగింపు
కాగా, రైతులకు కేంద్ర కేబినెట్ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు అమలు చేస్తున్న ‘పీఎం-కిసాన్’ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకూ ఈ పథకాన్ని పొడిగించింది. ఇందుకు రూ.3.15 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తూ, రూ.3,15,614 కోట్లు కేటాయించినట్టు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పథకం కింద అర్హులైన రైతులు రూ.6,000 వార్షిక ఆర్థిక సాయం పొందుతారు. రూ.2,000 చొప్పున మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో నేరుగా ఈ మొత్తాన్ని జమచేస్తారు.
ఖోలో ఇండియాకు రూ.29.000 కోట్లు, ఎన్‌ఎస్‌ఎఫ్ కూడా నిధుల పెంపు
దేశంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ఖేలో ఇండియా స్కీమ్ విస్తరణ, నేషనల్ స్పోరట్స్ ఫెడరేషన్‌కు బడ్జెటరీ సహాయాన్ని పెంచుతూ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అథ్లెట్స్ లో టాలెంట్‌ను పెంచి 2030 కామన్‌వెల్త్ గేమ్స్, 2036 ఒలంపిక్స్ గేమ్స్ ు్క పోటీపడేలా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ఖేలో ఇండియా పథకానికి రూ.29,054 కోట్లు కేటాయించింది. నేషనల్ సోరట్స్ ఫెడరేషన్‌కు కూడా రాబోయే ఐదేళ్లలో రూ.7,387 కోట్లు కేటాయించింది. ఈ రెండింటికీ కలిపి రూ.36,441 కోట్లు కేటాయించినట్టు కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వం కేటాయించిన మొత్తం గతంలో ఖేలో ఇండియా స్కీమ్‌కు కేటాయించిన దాని కంటే 8 రెట్లు ఎక్కువని అశ్విని వైష్ణవ్ తెలిపారు. యువక్రీడాకారులను ప్రోత్సహించడం, గ్లోబల్ స్పోర్టింగ్ పవర్‌హౌస్‌గా భారతదేశ క్రీడారంగాన్ని తీర్చిదిద్దేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు.
పీఎం సూర్య సరోవర్ యోజనకు రూ.5,070 కోట్లు
కాగా, ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన స్కీమ్‌కు రూ.5,072 కోట్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకూ ఇది వర్తిస్తుందన్నారు. ఇప్పటికే తలసరి సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో భారత్ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో ఫ్లోటింగ్ సోలార్ ప్యానల్ విద్యుత్ ఉత్పత్తిని ఏడు రెట్లు పెంచుతామని అన్నారు. ఈ పథకం కింద డ్యామ్‌లు, సరస్సులపై ఫ్లోటింగ్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తామని, 5,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని వివరించారు.











