మన తెలంగాణ/హైదరాబాద్: చట్టప్రక్రియ ను పాటించకుండా ప్రైవేటు స్థలంలో హైడ్రా ఏర్పాటుచేసిన బోర్డును 24 గంటల్లో తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా, విచారణ నిర్వహించకుండానే ప్రైవేటు స్థలంలో బోర్డు ఏర్పాటు చేయడంపై అసం తృప్తి వ్యక్తం చేసింది. హయత్‌నగర్ మండలం సాహెబ్‌నగర్ కలాన్‌లోని ప్లాట్ నెం.40లో హైడ్రా ఏ ర్పాటు చేసిన బోర్డును సవాలు చేస్తూ ఝా న్సీతో పాటు మరో వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టగా, పిటిషనర్ల తర పు న్యాయవాది గతంలో ఇదే స్థలానికి సం బంధించిన కూల్చివేత నోటీసులను హైకోర్టు రద్దు చేసిందని, ఏ చర్య తీసుకోవాలన్నా ముందుగా నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారం వ్యవహరించాలని స్పష్టం చేసినప్పటికీ అధికారులు దానిని పట్టించుకోలేదని వాదించా రు. వాదనలు విన్న న్యాయమూర్తి, ప్రైవేటు స్థలంలోని హైడ్రా బోర్డును 24 గంటల్లో తొ లగించి, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేశారు.

నోటీసులు లేకుండా కూల్చివేతలా?

కొండాపూర్‌లో ప్రైవేటు స్థలంలోని కాంపౌం డ్, వాచ్‌మెన్ గదిని నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంపై హైకోర్టు హైడ్రా అధికారులతో పాటు శేరిలింగంపల్లి ఎమ్మార్వోను ని లదీసింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రాకు సమాచారం ఏ ప్రాతిపదికన ఇ చ్చారో ఈ నెల 30న వ్యక్తిగత ంగా హాజరై వివరణ ఇవ్వాలని ఎమ్మార్వోను ఆదేశించిం ది. సర్వేలో అది పట్టా భూమిగా తేలినా, గ త కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా చర్య లు తీసుకోవడంపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.