
మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో మంచి స్థిరత్వం లభిస్తుంది. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. ప్రతిరోజు శని స్తోత్రం, దుర్గా స్తోత్రం చదవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా కుదిరితే చండీ హోమం చేయించండి మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సహోదరి సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సఖ్యత పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలలో చక్కగా పాల్గొంటారు. ఖర్చులు అదుపులో ఉంటాయి. చేసే ప్రతి కార్యక్రమంలోనూ పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి. దైవ అనుగ్రహం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానానికి సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. మెడికల్ ఎంసెట్ నీట్ అదే విధంగా ఇతరత్రా విద్యా సంబంధిత విషయ వ్యవహారాలు ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటాయి. పరీక్షలు దగ్గర పడుతున్నాయి ఎవరైతే ఎంసెట్ నీట్ కు ప్రిపేర్ అవుతున్నరో వారు చదువు మీద శ్రద్ధ వహించడం ఏకాగ్రత లోపించకుండా చూసుకోవడం చెప్పదగినది. సహోదరీ సోదరుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కు ప్రయత్నం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఒక అనుకోని పదవి లభించే అవకాశం గోచరిస్తుంది. అయితే మీరు కష్టపడిన దానికి ఫలితం తక్కువగా ఉన్నప్పటికీ దైవానుగ్రహం వలన ముందుకు సాగుతుంది. అదేవిధంగా కష్టానికి తగిన ప్రతిఫలం లభించే విధంగా గ్రహస్తితులు గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ కు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. సాఫ్ట్వేర్ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ చక్కగా అందుతాయి. అదేవిధంగా బంధు వర్గంలో విందు వినోదాల కార్యక్రమాలలో చక్కగా పాల్గొంటారు. ధనం కూడా శుభకార్యాలకు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయటం అదేవిధంగా హనుమాన్ సింధూరంతో హనుమాన్ కి సింధూర పూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
వృషభ రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. వ్యాపారపరంగా ఉద్యోగం పరంగా వీరికి రావలసిన బెనిఫిట్స్ చక్కగా వస్తాయి. పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఇంక్రిమెంట్స్ గాని, ప్రమోషన్స్ గాని వచ్చే అవకాశం ఉంది. జీతం పెరుగుతుంది. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఉద్యోగ అవకాశాలు చక్కగా కలిసి వస్తాయి. వ్యాపారంపరంగా మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారంపరంగా బాగుంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలలో అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. చేసే కార్యక్రమాలు దైవానుగ్రహం వలన ముందుకు సాగుతాయి. వ్యాపారాలు బాగుంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం చాలా చక్కగా లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, ముఖ్యంగా కళాకారులకు కాలం అనుకూలంగా ఉంది. ఎప్పుడో కొన్న స్థిరస్తుల విలువలు పెరుగుతాయి. నూతన గృహం నూతన వాహనాలు కొనేవారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రతిరోజు దుర్గా స్తోత్రం చదువుకొని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎంసెట్, నీట్, గ్రూప్స్ మొదలగు వాటికి ప్రిపేర్ అయ్యేవారు చదువు మీద శ్రద్ధ వహించి ముందుకు వెళ్ళండి. చదువు పట్ల నిర్లక్ష్యం వహించకండి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం చదవండి అలాగే దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో మంచి పేరు సంపాదించుకోగలుగుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఎంతైతే మీరు కష్టపడ్డారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం మీకు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్స్ గాని, ప్రమోషన్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు లభించే దిశగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం కొంతవరకు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారస్తులు చాలా జాగ్రత్త వహించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చెప్పదగిన సూచన. అందరి గురించి తెలుసుకోకుండా ముందుకు వెళ్లడం అనేది నష్టాన్ని కలిగిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా చేసి మోసపోకండి. ఎంతవరకు చేయాలో అంతవరకే చేయండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి రోజు ఓం నమో నారాయణాయ వత్తులతో దీపారాధన చేయటం, విష్ణు సహస్రనామ పారాయణంగాని, విష్ణు దేవాలయం దర్శించటం కానీ చేయండి మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 2, కలిసివచ్చే రంగు స్కై బ్లూ, ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మిథున రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయా కాదా అనే ఒక ఆలోచన ఉంటుంది. మీ ప్రయత్నం మీరు చేయండి మంచి ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఉద్యోగరీత్యా వ్యాపారిత్య మీరు ఏదైతే అనుకున్నారో అదే తప్పక నెరవేరుతుంది. అదేవిధంగా సహోదరి సహోదరుల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే ఆచితూచి వ్యవహరించడం చెప్పదగింది. కొన్ని కొన్ని విషయాలలో ముందు జాగ్రత్తగా ఉండాలి. మరి కొన్ని విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. భూ క్రయవిక్రయాలు అనుకూలంగా ఉంటాయి. ఎప్పుడో కొన్న స్థిరస్తుల విలువలు పెరుగుతాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. మీరు ఏదైతే ఒక కార్యక్రమం తలపెట్టి పూర్తి అవ్వకుండా ఉందో అది ఈ వారం పూర్తి అవుతుంది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. ఆరోగ్యం పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏదైనా సరే భాగస్వామి సలహాలు తీసుకొని ముందుకు వెళ్లాలి. లేకపోతే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు రియల్ ఎస్టేట్ కు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్మెటిక్స్ సినీ కళా రంగాల వారికి చిరుస్తాయి వ్యాపారస్తులకు అదే విధంగా కూరగాయ వ్యాపారస్తులకు హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలి, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అని ఆలోచన చేస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని విరమించుకొని కొన్నాళ్ళు ఆగి అంటే జూన్ తర్వాత ప్రారంభించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి రోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం చదవండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పటించడం చెప్పదగిన సూచన. అలాగే ప్రతిరోజు సాయంత్రం పూట రాహుకాల సమయంలో నిమ్మకాయ డొప్పలలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయటం అలా కుదరని పక్షంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ పెట్టండి మంచి ఫలితాలు కలుగుతాయి. దీనివల్ల నరదృష్టి ఉద్యోగంలో స్థిరత్వం వ్యాపారపరంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోవడం సంతానం పట్ల విద్యా పరంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోవడం జరుగుతుంది. చిన్న రెమిడీ అయినా సరే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసివచ్చే రంగు గ్రీన్, ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రదిస్తాయి.
కర్కాటక రాశి వారికి ఈ వారం గత వారం కంటే చాలావరకు బాగుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు, వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. వ్యాపారం గడిచిన వారం కంటే కూడా అంతకుముందు వారం కంటే కూడా ఈ వారం మంచి లాభాలు వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆరోగ్యం పరంగా కూడా మంచి అనుకూలత ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు స్థిరస్తులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచిగా కలిసి వస్తుంది. కొత్త ప్రాజెక్టులు రావటం ఉన్న ప్రాజెక్టులు సేల్ అవ్వటం ఇలాంటివి జరుగుతాయి. ఉద్యోగంలో కూడా స్థిరత్వం లభిస్తుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్స్ వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండ లభిస్తుంది. ఏదైనా సరే ఒక ఆలోచన నిర్ణయాత్మకంగా తీసుకునే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. అయితే మీ ఆలోచన విధానాన్ని బట్టి మంచి అనేది ఆధారపడి ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎవరో మనల్ని మోసం చేశారు ఇబ్బంది పెట్టారు మనం కూడా అలాగే చేయాలి అనే భావనను పక్కన పెట్టాలి. మీ పని మీరు చేసుకుని ముందుకు వెళ్ళండి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎన్ని నష్టాలు వచ్చినా సరే మీరు స్థిరంగా నిలబడిన రోజున అవి మంచి ఫలితాలను ఇస్తాయి. దైవానుగ్రహం చక్కగా ఉంది. దీనివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. భవిష్యత్తు బాగుంది. జూన్ నుంచి మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఏదైనా సరే ఆచితూచి అడుగు వేయటం అనేది చెప్పదగిన సూచన. విద్యార్థిని విద్యార్థులకు చక్కని కాలం అని చెప్పవచ్చు. విద్య మీద శ్రద్ధ వహిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం పరంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంది. చేసే పని కృషి రెండు ఫలిస్తాయి. ఏదైనా సరే మనం కష్టపడాలి భగవంతుని అనుగ్రహం ఉండాలి అది ఫలిస్తుంది. దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. దానధర్మాలు కూడా చేస్తారు. అదేవిధంగా విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కాలం చక్కగా ఉంది. వైద్య వృత్తిలో ఉన్నవారికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవి తొలగిపోతాయి. అదేవిధంగా విదేశాలలో ఉండి ఉద్యోగ ప్రయత్నం చేసుకునే వారికీ కలిసి వస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చెప్పుకోదగిన ఇబ్బందులు లేవు. కాలం చక్కగా ఉంది. అయితే ధనం విషయంలో మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. ఖర్చు పెడితే శుభకార్యాలకు పెట్టాలి. ఏదైనా సరే పిల్లలు బాగుండాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అనే ఆలోచనతోటి ముందుకు వెళ్తారు. దైవానుగ్రహం వలన అంత మంచే జరుగుతుంది గడిచిన రెండు మూడు వారాల కంటే ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం శివతాండవ స్తోత్రం పటించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఉదయం సాయంత్రం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి శనివారం నాడు ఆంజనేయ స్వామికి వడ మాల వేయండి మంచి ఫలితాలు సంప్రదిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 7, కలిసివచ్చే రంగు ఎరుపు, ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
సింహ రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయినా శని ప్రభావం వలన గతవారం కంటే ఈ వారం కొంత బాగానే ఉంది అని చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఆలస్యం అవుతుంది. సంబంధం విషయంలో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. వీరికి కలిసివచ్చే కాలం అని చెప్పవచ్చు. గడిచిన వారం కంటే ఇంతకుముందు వారాల కంటే ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వ్యాపారంలోను ఉద్యోగంలోనూ మంచి స్థాయిని సంపాదించుకుంటారు. అదేవిధంగా నూతన గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. సంతానానికి మంచి సంబంధం చూడాలి ఎంత ఖర్చైనా పర్వాలేదు వివాహం చేయాలని ఆలోచన చేస్తారు. సంతాన వివాహం విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. శత్రువులు కూడా మిత్రులు అయ్యే అవకాశం గోచరిస్తుంది. సహోదరి సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశం ఉంది. చార్టెడ్ అకౌంటెంట్స్ వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణము అని చెప్పవచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. నూతన విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. విదేశాలకు సంబంధించిన ప్రయత్నాలు జూన్ తర్వాత ప్రారంభించండి. కలిసిబాటుతనంగా ఉంటుంది. అదేవిధంగా విదేశాలకు వీసా కోసం హెచ్ వన్ బి వీసా కోసం ప్రయత్నం చేసే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వీరికి అష్టమ శని నడుస్తుంది. జన్మరాశిలో కేతువు అంత అనుకూలంగా లేదు. ప్రతి విషయంలో ఎక్కువగా ఆలోచించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అదేవిధంగా జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి రోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయటం హనుమాన్ చాలీసా పటించడం, దుర్గ స్తోత్రం పటించడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులు ఉదయం సాయంత్రం ఆఫీసులో ధూపం వేయటం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చదువు మీద మరింత శ్రద్ధ వహించండి. అనుకున్న ఫలితాలు వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కన్యా రాశి ఫలితాలు:-
కన్య రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ రంగం కోసం ప్రయత్నం చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రేమ వివాహానికి సంబంధించి మటుకు ఆచితూచి ఆలోచించటం చెప్పదగిన సూచన. ఏదైనా సరే పెద్దల నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళటం చెప్పదగిన సూచన. లేకపోతే వాటి విషయంలో నష్టం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు బాగున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు అలాగే గడిచిన వారం కంటే ఈ వారం చాలా చక్కగా కలిసి వస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సినీ కళా రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంది. టెక్నీషియన్స్ కాస్మోటిక్ గైనకాలజిస్ట్ ఆంకాలజీ ఈ రంగాల వారికి మంచి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. దుర ప్రాంత ప్రయాణాలలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించాలి. పెద్దల ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు బంగారానికి సంబంధించిన విషయ వ్యవహారాలు అలంకారానికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అలాగే శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయించినట్లయితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయి మంచి ఫలితాలు కలిసి వస్తాయి. అమ్మవారికి కుబేర కుంకుమ తోటి ఆరావళి కుంకుమ తోటి అష్టోత్తరం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంబంధం విషయంలో జాతక విశ్లేషణ చేసుకొని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. నూతన విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. పరీక్షలు దగ్గర పడుతున్నాయి నీట్ ఎంసెట్ ఇతరత్రా ఎగ్జామ్స్ కి ఎవరైతే ప్రిపేరవుతున్నారో అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా ప్రిపేర్ అయ్యే వారికి మంచి అవకాశాలు వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. గొడవలకు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు గతవారం కంటే ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలను వీరు చక్కగా సద్వినియోగం చేసుకుంటారు. పదిమందిలోనూ పేరు తెచ్చుకుంటారు. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు గ్రే, ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
తులా రాశి ఫలితాలు:- తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. భవిష్యత్తు మీద ఆశ పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. మీరు ఏదైతే ఇప్పటివరకు కష్టపడి సంపాదించుకున్నారో దానిని ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ లేదా బంగారు మీద పెట్టుబడి పెట్టడం కానీ ఒక నూతన గృహం కొనుగోలు కానీ చేస్తారు. ఆరోగ్య విషయం లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులు అధికంగా ఉంటారు. మన పక్కనున్న వారే మిత్రులు కానీ బంధువులు కానీ శత్రువులుగా మారే అవకాశం ఉంది. ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారో తెలియని పరిస్థితి గోచరిస్తుంది. అందరు మనవాళ్లే కదా అని సహాయం చేయడం జరుగుతుంది. మనం ఎంత సాయం చేసినా సరే మాకు ఏం చేసారని ఎదుటి వాళ్లు మనల్ని నిందిస్తారు. ఇవన్నీ పక్కనపెట్టి దైవనుగ్రహం వలన ముందుకు వెళ్లి మీ పని మీరు చేసుకోండి మంచి చెడు ఆ భగవంతుడే చూసుకుంటాడు. మన కష్టానికి తగిన ప్రతిఫలం మనం సంపాదించుకోవాలి. ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చక్కగా చేసుకోపోవాలి మిగతా విషయాలలో ఏ విషయంలోనూ తల దూర్చొద్దు. మన కుటుంబం బాగుందా లేదా అనేది చూసుకోవాలి. ఖర్చుల విషయంలో మాత్రం ఒకటికి రెండు రూపాయలు ఉండే అవకాశం ఉంది. కొంత జాగ్రత్త వహించండి. ఏదైనా సరే స్థిరమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళటం చెప్పదగిన సూచన. విద్యార్థిని విద్యార్థులు చదువు మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టాలి. చెడు వ్యసనాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. అమ్మాయిలు అయినా సరే అబ్బాయిలను సరే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. సొంత నిర్ణయాలు పనికిరావు. పెద్దల సలహాలు తీసుకొని ముందుకు వెళ్లాలి. ప్రేమ వివాహాలకు సంబంధించి ముఖ్యంగా ఆచితూచి అడుగులు వేయాలి. లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి రోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పటించడం చెప్పదగిన సూచన అదే విధంగా సుబ్రహ్మణ్యం అష్టకం పటించండి. మంగళవారం నాడు శుక్రవారం నాడు అమ్మవారికి కుబేర కుంకుమ తోటి ఆరావలి కుంకుమ తోటి కుంకుమార్చన చేయించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చేసరికి 9 కలిసివచ్చే రంగు స్కై బ్లూ ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
వృశ్చిక రాశి ఫలితాలు:-
వృశ్చిక రాశి వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్య రీత్య కొంత కుదుట పడుతుంది. ఏవైతే మీరు చేయదలుచుకున్న కార్యక్రమాలు ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఉద్యోగంలో ఉన్న చికాగులు తొలగిపోతాయి. రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానం కోసం చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి పోటీ పరీక్షలు సివిల్స్ గ్రూప్స్ ఎంసెట్ నీట్ ప్రిపేర్ అయ్యేవారికి కాలం అనుకూలంగా ఉంది. విద్యాపరంగా రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి. ఈ రాశిలోని వారికి మెడికల్ సీట్స్ వచ్చే అవకాశం ఉంది. . అదేవిధంగా వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. రూపాయికి రూపాయి ఖర్చు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్య రీత్యా కూడా ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా సరే దైవానుగ్రహం వల్ల మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి పుణ్యఫలం కావచ్చు దానివల్ల మంచి భవిష్యత్తు మీద ఆశలు పెరుగుతాయి. మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చక్కగా పదిమందికి ఉపయోగపడతాయి. ఈ రాశి వారు నూతన గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేస్తారు. విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు వైద్య వృత్తిలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగం వారికి కాలం అనుకూలంగా ఉంది. భూ సంబంధిత విజయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి మంచి కలిసిబాటుతనంగా ఉంటుంది. ఈ రాశి వారికి రావలసిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండా ఉండటం మంచిది. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. చేసే పనిని పదిమంది మెచ్చుకుంటారు. వివాహాది శుభకార్యాలలో చాలా చక్కగా పాల్గొంటారు. వివాహాది శుభకార్యాలలో మీ వంతు సహాయం మీరు చేస్తారు. మీరు చేసే సహాయం వలన ఆ దేవుడు ఆశీస్సులు మీ కుటుంబం పై ఎప్పుడు ఉంటాయి. ఖర్చులు పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పటించడం అలాగే మంగళవారం నాడు శుక్రవారం నాడు అమ్మవారికి కుబేర కుంకుమ తోటి ఆరావళి కుంకుమ తోటి కుంకుమార్చన చేయటం చెప్పదగిన సూచన. ఇంట్లో జిల్లేడు గణపతిని పెట్టుకోండి మంచి ఫలితాలు ఉంటాయి. నరదృష్టి అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసివచ్చే రంగు మెరూన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ధనుస్సు రాశి ఫలితాలు :-
ధనస్సు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పట్ల మంచి సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అర్ధష్టమ శని నడుస్తుంది. ఈ అర్ధాష్టమ శని కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఏదైనా సరే సామరస్యంగా ఉండాలి. పేరు ప్రఖ్యాతలు కంటే మన ఉద్యోగం స్థిరంగా ఉండాలి మన పని మనం చేసుకోవాలనే భావన తోటి ఉంటారు. కింది స్థాయి ఉద్యోగస్తులు మీ పైన ఈర్ష అద్వేషాలతో ఉంటారు. వారి విషయంలో జాగ్రత్త వహించాలి. ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారంలో కొన్ని లాభాలు ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా లాభాలు మాత్రం ఉంటాయి. వచ్చిన లాభాలను సేవింగ్స్ రూపంలో కానీ భూమి మీద కానీ బంగారం మీద కానీ పెట్టుబడి పెట్టండి మంచి ఫలితాలు ఉంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం అంతంత మాత్రమే ఉంటుంది. ఏదైనా సరే స్థిరమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళండి. అదేవిధంగా వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానం మంచి అభివృద్ధి లోకి వస్తుంది. విద్యాపరంగా మంచి అనుకూలత ఉంటుంది. సంతానానికి సంబంధించిన విషయాలలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి సమసి పోతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల వలన మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఉద్యోగంలోనూ ఇంట్లోనూ మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. మీరు చేసే కార్యక్రమాలలో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో వారికి. మీ సొంత నిర్ణయాలు తీసుకొని మీ పని మీరు చేసుకోవటం చెప్పదగిన సూచన. ఒక్కోసారి ఎంతమంది ఎంత ఇబ్బంది పెట్టిన సరే అవన్నీ పక్కన పెట్టి మీ పని మీరు చేసుకోవాలి. దుర్గా స్తోత్రం శని స్తోత్రం పటించి ఇంట్లో నుంచి వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారు చండీ హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం ఎనిమిది మంగళవారాలు సుబ్రమణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసివచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు బుధవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మకర రాశి ఫలితాలు:-
మకర రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. నిర్ణయాలు సరిగా ఉండవు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందామంటే పరిపరి విధాలుగా ఆలోచన చేస్తారు. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వలన ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగంలో కూడా స్థిరత్వం ఉండదు. చేతి దాక వచ్చిన అవకాశాలు చేజారి పోతాయి. మనం చేసుకున్న ఫలితమే వెనక్కి వచ్చిందనే భావన ఎక్కువగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. అలాగని ప్రయత్నాన్ని మాత్రం వదులుకోవద్దు. వచ్చిన అవకాశాన్ని చేజర్చుకోవడం తర్వాత బాధపడడం కంటే ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే కొన్ని ప్రయత్నాలు కలిసి రావు. దూర ప్రాంత ప్రయాణాలలో వాహనాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అలర్జీ కానీ ఆస్తమా అజీర్ణం ఎసిడిటీ అల్సర్ వంటి విషయాలలో జాగ్రత్తపడాలి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి రావు. ఏదైనా సరే స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా అన్నదమ్ముల మధ్య కావచ్చు అక్క చెల్లెల మధ్య కావచ్చు విభేదాలు వచ్చే అవకాశం ఉంది. గొడవలు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా సరే సామరస్యంగా ఉండి స్థిరమైన నిర్ణయాలు తీసుకొని ఆలోచనపరంగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. కోర్టు సంబంధిత విషయ వ్యవహారాలు ఇబ్బంది పెట్టే రకంగా ఉంటాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి అంతంత మాత్రమే ఉంటుంది. చేతిదాకా వచ్చిన ప్రాజెక్టులు చేజారి పోవడం జరుగుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. రూపాయికి రూపాయి ఖర్చు ఉండే అవకాశం ఉంది. అప్పుల విషయంలో క్రెడిట్ కార్డు వాడకం విషయంలో జాగ్రత్త వహించాలి. లోన్స్ కు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. వారి విద్య పట్ల ప్రతిదీ శ్రద్ధ తీసుకోవడం చెప్పదగిన సూచన. చెడు వ్యసనాలకు, సోషల్ మీడియాకు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పట్ల వ్యాపారం పట్ల సానుకూలంగా ఉంటుంది. మీరు ఎప్పుడో పెట్టిన షేర్స్ విలువ పెరగటం స్థిరాస్తుల విలువ పెరగడం జరుగుతుంది. సంతానానికి మంచి వివాహం కుదురుతుంది. ఆలోచన సఫలీకృతం అవుతుంది దూర ప్రాంత ప్రయాణాలు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పటించడం దుర్గా స్తోత్రం పటించడం చెప్పదగిన సూచన. రాహు కాల సమయంలో నిమ్మకాయ డొప్పలలో నువ్వుల నూనె పోసి దీపం పెట్టాలి మంగళవారం శుక్రవారం నాడు. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నేవి బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కుంభ రాశి ఫలితాలు :-
కుంభ రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. వివాహం పరంగా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వివాహ సంబంధిత విషయ వ్యవహారాలు అనుకూలంగా లేవు. సంబంధం చేతిదాక వచ్చి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం గోచరిస్తుంది. భార్య భర్తల మధ్య సఖ్యత తగ్గడం లేదా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. సంతానం మటుకు చక్కగా ఉంది. ఉద్యోగ విషయ వ్యవహారాలు కూడా చక్కగా ఉన్నాయి. ఉద్యోగంలో కూడా మంచి అనుకూలత ఉంటుంది. అయితే ఖర్చులు మాత్రం మన చేతిలో ఉండవు. రూపాయికి 50 రూపాయల ఖర్చు ఉండే అవకాశం ఉంది. ప్రతి విషయం డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఏదైనా డబ్బుతోనే ముడిపడి ఉందనే ఆలోచనకు వస్తారు. కోర్టు సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం వలన ఉద్యోగం పోవడం కానీ ఉద్యోగం మారడం కానీ జరుగుతుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. సహోదరి సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వీరికి ఏలినాటి శని నడుస్తుంది చండీ హోమం చేసుకోవడం లేదా 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం 8 మంగళవారాలు సుబ్రమణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఆరోగ్యం పరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు లేకపోలేదు. దూర ప్రాంత ప్రయాణాలు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి అంత అనుకూలంగా లేదు. సినీ కళా రంగాల వారికి, చార్టెడ్ అకౌంటెంట్ వారికి, సాఫ్ట్వేర్ రంగాల వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా నూతన గృహం కానీ నూతన వాహనాన్ని కానీ కొనుగోలు చేస్తారు. ఖర్చుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఖర్చు పెట్టాలి. వృధా ఖర్చుల వలన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఎవరికైనా మీ చేతి నుండి డబ్బులు అప్పుగా ఇస్తే అవి తిరిగి రావు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఒకవేళ డబ్బులు ఉంటే బంగారం మీద కానీ భూమి మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి మంచి ఫలితాలు వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపారపరంగా మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏలినాటి శని నడుస్తుంది వీరికి. శని కి తైలాభిషేకం చేయడం లేదా రుద్రాభిషేకం చేయటం చెప్పదగినది. ఉద్యోగంలో స్థిరమైన నిర్ణయాలు లేక ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. పై అధికారులు కావచ్చు కిందిస్థాయి ఉద్యోగులు కావచ్చు ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. ప్రతిఫలం చూసుకోకుండా మీ కష్టం మీరు చేయండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి రోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయటం, మంగళవారం నాడు శుక్రవారం నాడు దుర్గాదేవి అష్టోత్తరం పటించడం చెప్పదగిన సూచన. అమ్మవారికి కుబేర కుంకుమతో, ఆరావళి కుంకుమతో కుంకుమార్చన చేయించండి. చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా ఒక మాసంలో పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఏదైనా విభేదాలు ఉన్నా సరే తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రే, ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మీనరాశి ఫలితాలు :-
మీన రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. గతవారం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. గడిచిన వారం కంటే ఈ వారం బెనిఫిట్ గానే ఉంటుంది. భార్యాభర్తలు ఒక అండర్స్టాండింగ్ తో వెళ్ళాలి. ప్రతిదీ ఎక్కువ తక్కువ అని కాకుండా సామరస్యంగా వెళ్ళినట్లయితే ఇబ్బందులేని వాతావరణం ఉంటుంది. లేకపోతే భార్య భర్తల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. స్థిరాస్తులను అమ్మి ఒక ఇల్లు కానీ ఒక ప్లాటు గాని కొనుగోలు చేద్దామనుకుంటారు అది నెరవేరుతుంది. అదేవిధంగా సహోదరి సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారపరంగా లాభాలు బాగుంటాయి. వచ్చిన లాభాలను సేవింగ్స్ రూపంలో చేసుకోవడం మంచిది. సంపాదించిన దాంట్లో కొంత సేవింగ్ చేసుకునే అలవాటు చేసుకోండి. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. ఏలినాటి శని నడుస్తుంది. కానీ అందరికీ ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పలేము. భగవాన్ నామ స్మరణ ఎంత చేస్తే అంత బాగుంటుంది. శని ప్రభావం తగ్గటానికి హోమాలు కానీ రుద్రాభిషేకాలు గానీ చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సేవింగ్స్ కు వెళ్లడం ఎవరికి అప్పు ఇవ్వకపోవడం సాధ్యమైనంత వరకు ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెట్టడం చెప్పదగిన సూచన. ఏదైనా ఖర్చులు పెట్టేటప్పుడు జీవిత భాగస్వామితో చర్చించి పెట్టండి మంచి ఫలితాలు ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు రావు. లేకపోతే నష్టపోయే అవకాశం పుష్కలంగా ఉంది. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు బాగున్నాయి. ఆరోగ్య విషయం కూడా చక్కగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి. అందరిని నమ్మి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం గాని అప్పుగా ఇవ్వడం కానీ చేయొద్దు. డబ్బులు ఉంటే సేవింగ్స్ చేసుకోవడం భూమి మీద పెట్టుబడి పెట్టడం లేదా బంగారం కొనుక్కోవడం మంచిది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం దుర్గా స్తోత్రం పటించడం చెప్పదగిన సూచన. ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయడం చెప్పదగిన సూచన 9 వ వారం నాడు వడమల వేయండి దీని ద్వారా వ్యాపారపరంగా ఉద్యోగ పరంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోతాయి. భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి.












