
హైదరాబాద్: దేశంలో ఏ రాష్ట్రంలోనూ విద్యార్థులు అల్పాహార పథకం కార్యక్రమం లేదని డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క తెలిపారు. ఖాళీ కడుపుతో విద్యార్థులు ఎవరూ ఉండవద్దని ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. హరేకృష్ణ ఫౌండేషన్ నిర్వహించిన హోమంలో భట్టి పాల్గొన్నారు. హరేకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు అల్పాహార పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా మధిరలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 26 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నామని, రాబోయే 3 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయబోతున్నామని భట్టి తెలియజేశారు. అల్పాహార పథకాన్ని ప్రారంభించినపుడు సందేహాలు వ్యక్తమవుతాయని జోష్యం చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.











