
ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఒక విచిత్రమైన ప్రేమకథ ఇది. ఫ్రాన్స్‌కు చెందిన 81 ఏళ్ల వృద్ధురాలు ఆఫ్రికాకు చెందిన 24 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. రెండేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వీరిద్దరూ అప్పటి నుంచి ప్రతిరోజూ వీడియో కాల్స్, మెసేజ్‌లతో మాట్లాడుకుంటూ సన్నిహితమయ్యారు. ఇటీవల అతడిని కలిసేందుకు వెళ్లిన వృద్ధురాలు ఎయిర్‌పోర్టులో యువకుడిని హగ్ చేసుకుని ముద్దులు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సెప్టెంబర్‌లో పెళ్లి చేసుకోనున్నట్లు ఆమె తెలిపింది.వీరిద్దరి మధ్య దాదాపు 57 సంవత్సరాల భారీ వయసు తేడా ఉండటంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది.











