
వివో తన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ శ్రేణిలో సరికొత్త మొబైల్ లాంచ్ చేసింది. కంపెనీ దీనిని వివో Y6e 5G పేరిట చైనాలో అధికారికంగా విడుదల చేసింది. ప్రస్తుతం చైనాలో 3 రంగుల ఎంపికలలో అమ్మకానికి అందుబాటులో ఉన్న ఈ పరికరంలో 6.74-అంగుళాల HD+ (720×1,600 పిక్సెల్స్) LCD టచ్‌స్క్రీన్ డిస్ప్లే, ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 సిరీస్ చిప్సెట్, 13-మెగాపిక్సెల్ సింగిల్ రియర్ కెమెరా, 6,500mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ కు సంబంధించి ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
వివో Y6e 5G ధర, లభ్యత
చైనాలో వివో Y6e 5G స్మార్ట్ ఫోన్ 6GB + 256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 1,599 (సుమారు రూ. 22,000)గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ వివో చైనా ఆన్లైన్ స్టోర్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉండగా, ఫ్లోయింగ్ క్లౌడ్స్ వైట్, సన్‌సెట్ బ్లూ, ట్వైలైట్ బ్లాక్ వంటి మూడు రంగులలో లభ్యం కానుంది.
వివో Y6e 5G ఫీచర్లు
డిస్ప్లే
ఈ పరికరంలో 6.74-అంగుళాల HD+ (720×1,600 పిక్సెల్స్) LCD టచ్‌స్క్రీన్ డిస్ప్లేను అందించారు. దీనికి 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ గరిష్ట ప్రకాశం ఇచ్చారు.
ప్రాసెసర్
వివో నుండి వచ్చిన ఈ కొత్త Y సిరీస్ స్మార్ట్‌ఫోన్ క్వాల్కామ్ 4nm ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్తో పనిచేస్తుంది.
ఆపరేటింగ్ సిస్టమ్
ఆండ్రాయిడ్ 16 ఆధారిత కంపెనీ ఒరిజిన్OS 6 పై నడుస్తుంది.
కెమెరా
ఇందులో f/2.2 అపర్చర్, 10x డిజిటల్ జూమ్, ఆటోఫోకస్ సపోర్ట్‌తో కూడిన 13-మెగాపిక్సెల్ సింగిల్ రియర్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం f/2.2 అపర్చర్, 2x డిజిటల్ జూమ్‌తో కూడిన 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. కాగా, ఈ ఫోన్ 1080p వరకు వీడియోలను రికార్డ్ చేస్తుంది.
బ్యాటరీ
వివో Y6e 5G 6,500mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 15W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ హ్యాండ్సెట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం IP65 రేటింగ్‌ను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది.
కనెక్టివిటీ ఫీచర్లు
ఈ వివో ఫోన్ లో 5G, 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.1, USB టైప్-C పోర్ట్, GPS, GLONASS, BeiDou, QZSS, గెలీలియోలకు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. భద్రత కోసం, ఈ ఫోన్లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది.
కొలతలు
ఈ ఫోన్ కొలతలు 167.4×77.1×8.39mm. బరువు సుమారుగా 209 గ్రాములు.










