నగరపు వీధుల్లోఇప్పుడెలా వెలుగుతున్నాయో తెలుసా దీపాలు?నూనెతో కాదు…మనుషుల భయాలతో.ప్రతి గల్లీ మూలనఒక జెండా నిలబడి ఉంది,దేశాన్ని కాపాడటానికి కాదు,మనిషిని మనిషి నుండి వేరు చేయడానికి.పుస్తకాల అలమారల్లోరాజ్యాంగం పదిలంగా ఉంది,బహిరంగ సభల మైకుల్లోదాని అక్షరాలు శవపేటికలై రాలుతున్నాయి.సత్యం ఇప్పుడున్యూస్ ఛానెల్ స్క్రీన్ దిగువన పరుగెత్తేఒక చిన్న ‘బ్రేకింగ్’ పంక్తి మాత్రమే;అబద్ధం మాత్రందేశభక్తి రంగు పూసుకుని ఊరేగుతోంది.దేవుళ్లు కూడా అయోమయంలో ఉన్నారు,ఎవరిని రక్షించాలో తెలియక.ఎందుకంటేవారి పేర్లతోనే కదాఇళ్లను కాల్చుతున్నారు, కూల్చుతున్నారు.ఒక చిన్నారిపాఠశాల బస్తాలో పుస్తకాలు కాదు,తండ్రి భయాన్ని మోస్తోంది.రైతు చేతిలోని […]
The post కొంచెం మానవత్వం కోసం… appeared first on Navatelangana.













