
హైదరాబాద్: ఐపిఎల్‌లో బ్యాట్స్‌మెన్లు వెలుగులోకి వస్తున్నారని మాజీ క్రికెటర్ రవీచంద్రన్ అశ్విన్ తెలిపారు. స్టార్ బ్యాటర్ల గురించి జరిగిన చర్చ బౌలర్ల గురించి జరగడంలేదని, ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా గురించి మాత్రమే చర్చ జరిగిందని, అలాంటి బౌలర్లు టీమిండియాకు కావాలని తెలియజేశాడు. సిరాజ్, షమి, భువనేశ్వర్ వంటి బౌలర్లు జట్టులో లేకపోతే కొంత మంది ప్రశ్నిస్తారని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి బ్యాట్స్‌మెన్లు లేకపోతే తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలియజేశారు. రోకోలను టీమ్ నుంచి పక్కన పెడితే టాప్ లేచిపోతుందని హెచ్చరించారు. రోహిత్, కోహ్లీ ఆడాలనుకుంటే వారిని టచ్ చేసేవారు లేరని, అందుకు కారణం కూడా ఉందని, ఇద్దరు వన్డేల్లో 12 వేలకు పైగా పరుగులు చేయడంతో పాటు ఎన్నో రికార్డులు నెలకొల్పారని, రోహిత్, కోహ్లీకి భారీ అభిమాన గణం ఉందని, అభిమానులు క్రికెట్ స్టేడియానికి రావడానికి ఆ ఇద్దరే కారణమని అశ్విన్ వివరించారు. వారిని బలవంతంగా టీమ్ నుంచి పంపిస్తే అభిమానుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.











