
వెంకటేశ్ దగ్గుబాటి హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. నారా రోహిత్, నివేతా పేతురాజ్, రాజా ప్రజ్వల్ను ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ వీడియోలను రిలీజ్ చేశారు. చిట్టిబాబుగా వెంకటేశ్, ఆయన భార్య స్వర్ణగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి పాత్రలను పరిచయం చేశారు.
తాజాగా ఈ జంట కుమార్తె ‘సంపూర్ణ’ పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఈ పాత్రలో యువినా పార్థవి నటిస్తోంది. అమాయకత్వం, చిలిపితనం, అల్లరితో నిండిన సంపూర్ణ చిట్టి బాబుతో తాను ప్రేమలో ఉన్నానని చెబుతుంది. దీంతో చిట్టి బాబు ‘ఈసారి ఎవరు కార్ మెకానికా’ అని అడగటం.. ఆ తర్వాత సంపూర్ణ చెప్పే సమాధానం నవ్వులు పూయిస్తుంది. సంపూర్ణ పాత్ర చిట్టిబాటు జీవితంపై ఎంతటి ప్రభావం చూపుతుందో వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇక తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆక్టోబర్ 2వ తేదీను ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.











