రేషన్‌కార్డు లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ- కేవైసీ పూర్తి చేయడానికి గడువును మరో నెల రోజులు పొడిగించింది. ఈ -కేవైసీ చేయడానికి శుక్రవారం ఆఖరి రోజు కావడంతో ఆ గడువును ఆగష్టు 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు పౌరసరఫరాలశాఖ ప్రకటించింది.ఈ కేవైసీ చేయనప్పటికీ ఆగస్టు 31 వరకు రేషన్ పొందవచ్చునని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తి చేసుకునే గడువును

ఆగస్టు 31వ తేదీ వరకు వరకు పొడిగించినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి మూడు నెలల రేషన్‌ను ప్రభుత్వం ఒకేసారి పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 8,43,607 ఆహార భద్రత కార్డుదారులకు ప్రభుత్వం 59,602.822 మెట్రిక్ టన్నుల బియ్యం, 7,279.513 మెట్రిక్ టన్నుల గోధుమలు కేటాయించిందని, బియ్యం ఉచితంగా, గోధుమలను కిలోకు రూ.7 చొప్పున పంపిణీ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.