
కొలంబో: శ్రీలంక XIతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ ఆఖర్లో మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. చివరి ఓవర్‌లో వరుసగా మూడు సిక్సులు బాదాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక XI 363/8 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా.. భారత్ 357/6 వద్ద తొలి ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసింది.
దీంతో ఆరు పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్ ప్రారంభించిన శ్రీలంక XI 200/6 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి భారత్‌కు 207 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. అయితే భారత బ్యాటింగ్‌లో జైస్వాల్ (61) అర్థ శతకం సాధించాడు. ఇక గిల్ 44, పంత్ 28, జడేజా 22 (రిటైర్డ్ హర్ట్) పరుగులు చేశారు. ఆఖర్లో సిరాజ్ 15 బంతుల్లో 1 ఫోరు, 4 సిక్సులతో 32 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఫలితంగా భారత్ 45 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక XI బౌలింగ్‌లో నువాంత 2, మెండీస్, ఫెర్నాండో తలో వికెట్ తీశారు.








