
మహిళల ఆసియా కప్-2026 ఆ తర్వాత జరిగే ఆసియా క్రీడల కోసం రెండు వేర్వేరు జట్లను ఆ దేశ బోర్డు ప్రకటించింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన టి-20 సిరీస్‌కి దూరంగా ఉన్న ఫాతిమా సనా తిరిగి జట్టులోకి వచ్చింది. ఈ రెండు జట్లకు ఆమె కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఫాతిమాతో పాటు సదియా ఇక్బాల్, గుల్ ఫెరోజా కూడా ఆసియా కప్ జట్టులోకి వచ్చారు. ఆసియా కప్ ఆగస్టు 28 నుంచి దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి.
ఆసియా కప్‌కు పాకిస్థాన్ జట్టు
ఫాతిమా సనా (కెప్టెన్), అయేషా జాఫర్, ఇమాన్ నసీర్, ఐమన్ ఫాతిమా, గుల్ ఫెరోజా, మొమినా రియాసత్, మునీబా అలీ సిద్ధిఖీ (కీపర్), నజీహా అల్వీ, నష్రా సంధు, నదియా ఇక్బాల్, సైరా జబీన్, షవాల్ జుల్ఫికార్, తూబా హసన్, ఉమ్-ఎ-హానీ, వహీదా అక్తర్.
సెప్టెంబర్ నుంచి జపాన్ వేదకగా జరుగనున్న ఆసియా క్రీడలకు వేరే జట్టును ఎంపిక చేశారు. ఆసియా కప్‌తో పోలీస్తే ఈ జట్టులో కొన్ని మార్పులు ఉన్నాయి. ఆసియాకప్‌లో ఉన్న సదియా ఇక్బాల్, వహీదా అక్తర్, నజీహా అల్వీలకు ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కలేదు. వారి స్థానంలో అలియా రియాజ్, తస్మియా రుబాబ్, హుమ్నా బిలాల్‌ను ఎంపిక చేశారు.
ఆసియా క్రీడలకు పాక్ జట్టు
ఫాతిమా సనా (కెప్టెన్), అలియా రియాజ్, అయేషా జాఫర్, ఎమాన్ నసీర్, ఈమాన్ ఫాతిమా, గుల్ ఫిరోజా, హుమ్నా బిలాల్, మోమినా రియాసత్, మునీబా అలీ సిద్దిఖీ (కీపర్), నష్రా సంధు, సైరా జబీన్, షవాల్ జుల్ఫికార్, తస్మియా రుబాబ్, తూబా హసన్, ఉమ్-ఎ-హనీ.








