మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అదనం గా ఎలాంటి రుసుములు వసూలు చేసి నా అది చట్టవిరుద్ధమని తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులషన్ క మిటీ (టిఎఎఫ్‌ఆర్‌సి) స్పష్టం చేసింది. నిర్ణీత ఫీజుల కంటే అదనంగా వసూలు చేసే ఇంజనీరింగ్ కాలేజీలపై చర్యలు తప్పవని హెచ్చరించింది. కేరియర్ డెవలప్‌మెంట్ ఫీజు, క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్, యూనిఫాం ఫీజుల పేరుతో కొన్ని యాజమాన్యాలు అదనపు మొ త్తాలు వసూలు చేస్తున్నట్లుగా తమకు ఫిర్యాదు లు వచ్చినట్లు టిఎఎఫ్‌ఆర్‌సి తెలిపింది.

ప్రభు త్వ ఆదేశాల ద్వారా అనుమతించిన ఫీజు కం టే ఏ పేరుతో అదనంగా వసూలు చేసినా దా నిని క్యాపిటేషన్ ఫీజుగానే పరిగణిస్తామని హె చ్చరించింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిం చి అదనపు ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఉల్లంఘనకు పా ల్పడే విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలతో పాటు, నిబంధనలు పాటించని కాలేజీలకు ఒ క్కో విద్యార్థికి రూ.2 లక్షల చొప్పున జరిమానా విధిస్తామని తెలిపింది. అదనపు ఫీజులు వసూ లు చేస్తున్న కాలేజీలపై విద్యార్థులు, తల్లిదండ్రులు తగిన ఆధారాలతో నేరుగా టిఎఎఫ్‌ఆర్‌సి కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని సూచించింది.