
మన తెలంగాణ/క్రీడా విభాగం: జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరిగిన సిరీస్‌లలో ఘోర పరాజయాలు చవిచూసిన భారత్‌కు ఈ గెలుపు కొత్త ఊపు ఇచ్చిందని చెప్పాలి. బ్యాటింగ్, విభాగాల్లో నిలకడగా రాణించిన టీమిండియా 30తో సిరీస్‌ను వైట్‌వాష్ చేసింది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఈ గెలుపు అతి పెద్ద ఊరటగా చెప్పక తప్పదు. రానున్న సిరీస్‌లలో మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఈ గెలుపు దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నిలకడైన బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మూడు మ్యాచుల్లోనూ వైభవ్ అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. జట్టు విజయంలో అతని పాత్ర చాలా కీలకమని చెప్పాలి.
విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగిన వైభవ్ భారత్‌కు మెరుపు ఆరంభాన్ని అందించడంలో ముఖ్యభూమిక పోషించాడు. జింబాబ్వేపై రాణించడం ద్వారా వైభవ్ టీమిండియాలో తన స్థానాన్ని మరింత మెరుగు పరుచుకున్నాడు. అయితే అభిషేక్ శర్మ వైఫల్యం జట్టును కలవరానికి గురిచేస్తోంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును ముందుండి నడిపించడంలో సఫలమయ్యాడు. ఇక వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తన పాత్రను సమర్థంగా పోషించాడు. మూడు మ్యాచుల్లోనూ మెరుపు బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచాడు. తిలక్‌వర్మ కూడా పర్వాలేదపించాడు. బౌలింగ్‌లో కూడా భారత్ మెరుగైన ప్రదర్శన చేసింది. మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్ తదితరులు అద్భుత బౌలింగ్‌ను కనబరిచారు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన టీమిండియా చిరస్మరణీయ విజయం అందుకుంది.











