ఐపిఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్నమ్యాచ్ లో పంజాబ్ జట్టు భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(56), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(59)లు అర్ధశతకాలతో చెలరేగారు. కనోలి(38), సూర్యాంశ్(21 నాటౌట్)లు ధనాధన్ బ్యాటింగ్ తో మెరుపులు మెరిపించారు. దీంతో పంజాబ్, ఢిల్లీకి 211 పరుగుల భారీ టార్గెట్ ను నిర్దేశించింది.