ఐపిఎల్ 2026లో భాగంగా మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య రసవత్తర పోరు సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో జైపూర్ లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచిన ఎస్ఆర్ హెచ్ బౌలింగ్‌ ఎంచుకుంది. తీసుకున్న హైదరాబాద్‌. దీంతో మొదట రాజస్తాన్‌ బ్యాటింగ్‌కు దిగనుంది. గత మ్యాచ్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని రాజస్థాన్ భావిస్తోంది. ఇక, స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్ తిరిగి రావడంతో.. హైదరాబాద్ బౌలింగ్ మరింత బలంగా మారనుంది. వరుసగా మూడు విజయాలతో దూసుకుపోతున్న హైదరాబాద్.. మరోసారి రాజస్థాన్ ను ఓడించి తమ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.

జట్ల వివరాలు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(w), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(సి), శివంగ్ కుమార్, సకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగ

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ