వాషింగ్టన్: ఎప్పుడు అమెరికా వచ్చినా ఈ హోటల్ లోనే ఉంటానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎపాల్ తెలిపారు. కాల్పులు జరిగినప్పుడు హోటల్ లోనే ఉన్నానని అన్నారు. వాషింగ్టన్ హిల్టన్ హోటల్ లో జరిగిన కాల్పులకు కెఎపాల్ స్పందించారు. ప్రపంచంలో శాంతి కరువైందని యుద్దాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని, అమెరికా అధ్యక్షుడికే రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సెక్యూరిటీని తప్పించుకొని షూటర్ ఎలా హోటల్ లోకి వచ్చాడు? అని ప్రశ్నించారు. యుద్ధాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, ఇప్పటికైనా యుద్ధాలు ఆపి శాంతికి కృషి చేయాలని కెఎపాల్ అమెరికాను కోరారు.