
న్యూయార్క్: అమెరికాలోని ఓ ఆంధ్రా యువతి అనారోగ్య సమస్యలతో మృతి చెందింది. ఆంధ్ర్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాకు చెందిన పిట్ట లోకేశ్వరి(28) గత కొంతకాలంగా లుకేమియా వ్యాధితో బాధపడుతోంది. లుకేమియా శృతిమించడంతో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఆమె సొంతగ్రామం పిట్టువారిపాలెంలో విషాదచాయలు అలుముకున్నాయి. నార్త్ వెస్ట్ మిస్సోరి స్టేట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తోంది. యువతి మృతదేహాన్ని భారత్ కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.














