న్యూయార్క్: అమెరికాలోని మిసిగన్‌లో కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. యుఎస్‌ఎలో రోజు రోజుకు గన్ కల్చర్ పెరిగిపోతుంది. ఎప్పుడు ఎక్కడ తుపాకీ పేలుతోందని అమెరికన్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లదీస్తున్నారు. డెట్రాయిట్‌కు 271 కిలో మీటర్ల దూరంలో మిస్సాకీ కౌంటీలో ఓ వ్యక్తి కాల్పులు జరడంతో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడు చాద్‌హిక్‌మన్(39) మృతదేహాన్ని గుర్తించారు. అతడి మృతదేహం మహిళ, వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. అతడు రెండు ప్రదేశాలలో కాల్పులు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు. కొందరు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. బాలికను వేధించిన కేసులో హిక్‌మన్‌కు 2024లో శిక్ష పడింది. అమెరికాలోని వర్జీనియా స్టేట్ యూనివర్సిటీలో శనివారం కాల్పులు జరగడంతో ఐదుగురు గాయపడిన విషయం తెలిసిందే.