
మన తెలంగాణ/హైదరాబాద్: అమెరికాలోని కా లిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు హైదరాబాదీ లు దుర్మరణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వాళ్లు ముగ్గురూ హైదరాబాద్lలోని యాకుత్‌పురా ఐఎస్ సదన్ డివిజన్ లోని వాణినగర్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కుటుంబంలోని ఐ దుగురు సభ్యులు కారులో ప్రయాణి స్తున్నారు. చ నిపోయిన వారిని సల్మా (45), కుమార్తె హఫీజా షేక్(19) కుమారుడు హఫీజ్ ఒమర్(14)లుగా పోలీసులు గుర్తించారు. 47 ఏళ్ల షేక్ అబ్దుల్ నవీద్ తో పాటు ఐదేళ్ల చిన్నారి ఖదీజా తీవ్ర గాయాల తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అమెరికాలోని సెయింట్ ఫ్రాన్సిస్ ప్రాం తంలో ఈ ఘోరం సంభవించింది.
నజియా భర్త షేక్ అబ్దుల్ నవీద్ హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌లో దాదాపు పదేళ్ల పాటు శాస్త్రవేత్తగా పనిచేశారు. ఈ కుటుంబంఅమెరికాలో స్థిరపడినట్లు తెలిసింది. చనిపోయిన ముగ్గురి అంత్యక్రియలు జూలై 24న అమెరికాలోనే జరగనున్నాయని బంధువులు వెల్లడించారు. కాగా, ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అతివేగం కారణమా? లేక మరో వాహనం ఢీకొట్టిం దా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న కాలిఫోర్నియా పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై హైదరాబాద్‌లోని బాధిత కుటుంబసభ్యులకు సమాచారం అందడంతో వారి ఇళ్లలో తీవ్ర విషాదం నెలకొంది.











