
అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. ఫ్లోరిడాలో పని చేస్తున్న సురేష్ కుమార్ (41) అనే తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇటీవల ప్రాణాలు కోల్పోయారు. ఛాతీనొప్పితో బాధపడుతున్న సురేష్‌ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు కారణంగానే సురేష్ మరణించినట్లు తెలుస్తోంది. సురేష్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. వీరిలో ఏడేళ్ల అబ్బాయికి ప్రత్యేక వైద్య సేవలు అవసరం. మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం అతడి మిత్రులు, సన్నిహితులు ఆన్‌లైన్‌లో ఫండ్ రైజింగ్ చేపట్టారు.












