న్యూయార్క్: అమెరికా శ్వేతసౌధం సమీపంలో కాల్పులు కలకలం సృష్టించాయి. వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో దుండగులు కాల్పులు జరపడంతో వందలాది మంది అతిథులు టేబుళ్ల కింద దాక్కున్నారు. కాల్పుల్లో ఓ అధికారికి గాయపడ్డారు.  సీక్రెట్లు ఎజెంట్లు వెంటనే కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మొదటి మహిళ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో సహా పలువురు కీలక నేతలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడారు. భద్రతా సిబ్బంది అద్భుతంగా పని చేశారని కొనియాడారు.  కాల్పుల సమయంలో అందరూ అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారని కొనియాడారు. నిందితుడి దగ్గర చాలా ఆయుధాలు ఉన్నట్లు గుర్తించారని, నిందితుడు కాలిఫోర్నియాకు చెందిన వ్యక్తిగా గుర్తించారన్నారు. ఇది అమెరికా రాజ్యాంగంపై దాడిగా భావిస్తున్నామని ట్రంప్ తెలిపారు.