న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఆస్తకికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వరుసగా సమావేశమయ్యారు. ఒకవైపు ఢిల్లీలో తన రాజీనామాకు పట్టుబడుతూ ఆందోళనలు వెల్లువెత్తున్న తరుణంలో ఆయన భేటీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పార్లమెంట్‌లోని అమిత్ షా కార్యాలయంలో ప్రధాన్ ఆయనతో సమావేశమయ్యారు.

అయితే వారిద్దరి ఏం అంశాలపై చర్చి జరిగిందన్నది వెల్లడి కాలేదు. తొలుత అమిత్ షాతో సమావేశమైన ప్రధాన్, సాయంత్ర కల్లా పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యారు. నీట్ యూజీలో అవకతవకల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో కొంత కాలంగా కాక్రోచ్ జనతా పార్టీతో పాటు పర్యావరణ ఉద్యమకారుడు వాంగ్‌చుక్ దీక్ష నేపథ్యంలో దీక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజా సమావేశాలతో ఆయన రాజీనామాపై పెద్ద ఎత్తున్న ఊహాగానాలు వెల్లువెత్తున్నాయి.