నవతెలంగాణ – హైదరాబాద్ : జమ్మూ-కశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లా కంగన్ ప్రాంతంలో మంగళవారం వేగంగా వెళ్తున్న అమర్‌నాథ్ యాత్రికుల బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో 39 మంది యాత్రికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఒక మలుపు వద్ద డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో బస్సు హరిగాన్వాన్ వద్ద ఓ ఇంటిపై పడింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేరని అధికారులు పేర్కొన్నారు. అమర్‌నాథ్ ఆలయంలో పూజలు ముగించుకుని తిరిగివస్తుండగా ప్రమాదం జరిగింది.
The post అమర్‌నాథ్ యాత్రికుల బస్సు బోల్తా..39 మందికి గాయాలు appeared first on Navatelangana.












