ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్‌లు ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే వీరిద్దరి వివాహం జరుగుతుందని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఓసారి న్యూయార్క్‌లో వీరిద్దరు జంటగా కనిపించారు. అప్పటి నుంచే ఈ జంటపై డేటింగ్ రూమర్స్‌కి ఇంకా బలం చేకూరింది. ఈ ఏడాదిలోనే వీరిద్దరి వివాహం జరుగుతుందనే టాక్ కూడా ఉంది. అయితే తాజాగా ఈ రూమర్స్‌పై ప్రముఖ నటుడు వైజి మహేంద్రన్ స్పందించారు.

అనిరుధ్, కావ్వాలు వివాహం చేసుకోబోతున్నారా? అని ఆయన్ను ప్రశ్నించగా.. అవుననే సమాధానం ఇచ్చారు. కావ్య మారన్ ప్రస్తుతం వ్యాపారవేత్తగా రాణిస్తున్నారని ఆయన అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. వీరిద్దరు పెళ్లి చేసుకుంటే మ్యూజికల్ బిజినెస్ అవుతుందని సరదాగా మాట్లాడారు. కాగా, వైజి మహేంద్రన్.. అనిరుధ్‌కు వరుసకు పెద్దనాన్న కావడం విశేషం. ఆయన కామెంట్స్‌తో ఏడాదికి పైగా వస్తున్న రూమర్స్‌కు తెరపడింది.