
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో బుధవారం ఉగ్రవాదలు కాల్పులకు తెగబడ్డారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులను లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. వాహనంపై వెళ్తూనే తుపాకులతో కాల్పులు జరిపరారు. ఈ ఘటనలో ఓ హెడ్ కానిస్టేబుల్ ఆషిఖ్ హుస్సేన్ తీవ్రంగా గాయపడగా సిబ్బంది వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలిచారు. చికిత్స పొందూ ఆయన తుది శ్వాస విడిచినట్లు అధికారలు వెల్లడించారు. మృతుడు బుద్గామ్ జిల్లాలోని బీర్వా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటన అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టాయి.











