అమరావతి: అనంతపురం జిల్లా రుద్రం పేటలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై వైసిపి నేత ఖాజా హుస్సేన్ అనే వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు హుస్సేన్ ను పట్టుకుని గుండు కొట్టించి దేహశుద్ధి చేశారు. కుటుంబ సభ్యులు ఫోర్త్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. వైసిపి నేత కావడంతో పంచాయితీ చేసి పోలీసులు తనను వదిలి పెట్టారు. మతిస్థిమితం లేదంటూ కేసును తప్పుదోవ పట్టించే యత్నం చేశారు. వైసిపి నేత ఖాజా హుస్సేన్ ను వదిలి పెట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.