కాబూల్: అఫ్గానిస్థాన్‌లో మెరుపు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తూర్పు అఫ్గానిస్థాన్ ప్రావిన్స్‌లో భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. 20 మంది మరణించగా, 80 మందికి పైగా గాయపడ్డారు. మరో 100 మంది జాడ గల్లంతైనట్టు అఫ్గాన్ అధికారులు వెల్లడించారు. నూరిస్థాన్ ప్రావిన్స్‌లోని పరున్ సిటీ, ఇతర ప్రాంతాల్లో వరదల తాకిడికి భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్టు నేషనల్ డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ ప్రతినిధి యూసఫ్ హమ్మద్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అఫ్గనిస్థాన్‌లోని 2024లో సంభవించిన భారీ వరదల్లో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, ఈ ఏడాది మొదట్లో దేశంలోని పలు ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడి సుమారు 110 మంది మరణించారు.