
నాసిక్ : టిసిఎస్ నాసిక్ కేసులో టిసిఎస్ ఉద్యోగిని నిదాఖాన్ అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ పొందడంలో విఫలమైన తరువాత ఆమె గురించి సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మంగళవారం వివరించారు. నాసిక్ కంపెనీలో బలవంతపు మత మార్పిడిలో ఆమె కీలక పాత్ర వహించారని, ప్రస్తుతం ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. నాసిక్ లోని ఐటీ మేజర్ యూనిట్‌లో లైంగిక వేధింపుల కేసులపై చర్చించారు. ఇంతవరకు ఎనిమిది మందిని ఈ కేసులో అరెస్టు చేశారు.
పోష్ (ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్‌మెంట్ )కమిటీ వీడియో కాన్షరెన్సులపై ఆధారపడకుండా తరచుగా వ్యక్తిగతంగా స్థానిక సభ్యులను కలుసుకుని వివరాలు సేకరించాలన్నారు. ఈ కేసులో తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, అందులో ఒకదానిలో నిదాఖాన్, మరో నలుగురు నిందితులుగా ఆరోపించబడింది. లైంగిక వేధింపులే కాదు, బలవంతంగా మతం మార్పిడి చేయించడం లోనూ ఆమె పాత్ర ఉన్నట్టు తేలింది.
ఈ కేసు వెలుగు లోకి వచ్చిన దగ్గరి నుంచి ఆమె పరారీలో ఉంది. సోమవారం సెషన్స్ కోర్టు ఆమెకు అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ ఇవ్వడానికి నిరాకరించింది. ఈమేరకు ఆమె యాంటిసిపేటరీ బెయిల్‌పై విచారణ ఏప్రిల్ 27కు వాయిదా పడింది. నాసిక్ పోలీస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఈ కేసుల దర్యాప్తు చేపట్టింది. ఆమెను పట్టుకోడానికి మూడు టీమ్‌లను ఏర్పాటు చేశారు.












