
గద్వాల్: జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మధ్యరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగింది. డిపో నుంచి పట్టణ పుర వీధుల వరకు భారీ ర్యాలీ చేపట్టిన ఉద్యోగులు, అనంతరం పాత బస్టాండ్ వద్ద మానవ హారం ఏర్పాటుచేసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఉదయము 11.00 గంటల వరకు సమ్మె సాఫీగా కొనసాగుతున్నప్పటికీ 11.00 గంటల తర్వాత ప్రైవేట్ డ్రైవర్లు, ప్రైవేట్ కండక్టర్ల తో పోలీస్ పహార మధ్య ఆర్టిసి బస్సులు బయటకు కదిలాయి. గద్వాల ఆర్టీసీ బస్టాండ్ లో గద్వాల పట్టణ ఎస్సై కళ్యాణ కుమార్ ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి పోలీస్ పహార మధ్య బస్సులు బయటకి కదులుతున్నాయి.













