చెన్నై: వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో షాక్ తగిలింది. గాయంతో యువ ఆటగాడు ఆయుష్ మాత్రె ఐపిఎల్‌కు దూరమయ్యాడు. ఈ సీజన్‌లో చెన్నై అంతంత మాత్రంగానే రాణిస్తోంది. ఆరు మ్యాచుల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. ఇలాంటి స్థితిలో ప్రతిభావంతుడైన బ్యాటర్‌గా పేరున్న ఆయుష్ దూరం కావడం సిఎస్‌కెకు పెద్ద ఎదురు దెబ్బగానే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాడు.

ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆయుష్ గాయానికి గురయ్యాడు. తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో గాయం తీవ్రత అధికంగా ఉన్నట్టు తేలింది. అతనికి కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చారు. దీంతో ఆయుష్ ఈ సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోయాడు. ఈ విషయాన్ని సిఎస్‌కె యాజమాన్యం మంగళవారం అధికారికంగా ప్రకటించింది.