
కెసిఆర్‌ను ప్రశ్నించిన కాంగ్రెస్ నేతలు
ఇందిరా పార్కు వద్ద మహాధర్నా
ప్రతిపక్ష నేత హోదాను అపహాస్యం చేయడం సరికాదు
జీతభత్యాలు తీసుకుంటూ అసెంబ్లీకి మొహం చాటేయడమేంటి?: పిసిసి చీఫ్ మహేశ్
కుమార్ గౌడ్ వెయ్యి రోజులు సభకు రాకపోతే ఆ హోదా ఎందుకు: మంత్రి
పొన్నం ప్రభాకర్ మరో పదేళ్లు రోడ్లపైనే బిఆర్ఎస్: మంత్రి శ్రీధర్‌బాబు
మన తెలంగాణ/హైదరాబాద్: “అసెంబ్లీకి వస్తా రా?.. ప్రతిపక్ష పదవికి రాజీనామా చేస్తారా?” అ ని పలువురు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బిఆర్ఎస్ అధినేత, ప్ర ధాన ప్రతిపక్ష నేత కెసిఆర్‌ను ప్రశ్నించారు. కెసిఆ ర్ వెయ్యి రోజులుగా అసెంబ్లీ సమావేశాలకు రాకుండా జీతభత్యాలు తీసుకుంటూ ప్రధాన ప్రతిపక్ష (క్యాబినెట్) హోదా అనుభవిస్తున్నారని కాం గ్రెస్ నేతలు మండిపడ్డారు. కెసిఆర్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఆదివారం ఇందిరా పార్కు, ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దీక్షకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి వచ్చారు.
పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ ప్రసంగిస్తూ ప్రజాస్వామిక దేశంలో ప్రతిపక్ష నాయకుల బాధ్యత చాలా కీలకమైందన్నారు. అటువంటి ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కెసిఆర్ జీతభత్యాలు తీసుకుంటూ అసెంబ్లీ సమావేశాలకు రాకుండా మొఖం చాటేయడం ఏమిటని ప్రశ్నించారు. ఫామ్ హౌస్‌కే పరిమితమైన కెసిఆర్ ప్రతిపక్ష నేతగా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రతిపక్ష నేత హోదాని అపహాస్యం చేయడం సరికాదన్నారు. బిఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. అధికారం ప్రజలు ఇచ్చే కానుక అని, ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా ్రప్రభుత్వం పాలన చేయాల్సి ఉంటుందన్నారు. తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యంతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కెసిఆర్ పదేళ్ళ పాలన, తమ వెయ్యి రోజుల పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.
ప్రభుత్వ ఉద్యోగిపై వేటు వేస్తాం.. మరి కెసిఆర్‌పై: మంత్రి పొన్నం
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగిస్తూ ప్రభుత్వ ఉద్యోగి 365 రోజులు విధులకు హాజరుకాకపోతే ఉద్యోగం నుంచి తొలగించేందుకు రూల్స్ ఉన్నాయి...కానీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష హోదా అనుభవిస్తున్న కెసిఆర్ 1000 రోజులు సభకు రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏమైనా చేయనివి ఉంటే బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు తన అనుభవంతో సూచనలు చేసి ఉంటే బాగుండేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహచర మంత్రులందరం నిరంతరం శ్రమిస్తున్నామని ఆయన తెలిపారు. పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
తెలంగాణ ఏర్పాటును అవమానించిన బిజెపి రాష్ట్రానికి ఏం తెచ్చారు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగిస్తూ బిఆర్ఎస్ ప్రభుత్వంతో పదేళ్లు అనేక ఇబ్బందులు పడిన ప్రజానీకానికి మార్పు కావాలని 2023లో క్రాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చుకున్నారని తెలిపారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కెసిఆర్ అసెంబ్లీకి వచ్చి వారి అనుభవాలు అసెంబ్లీలో చెబితే బాగుంటుందని పిలుపునిస్తున్నాం అన్నారు. కెసిఆర్ ఏదీ చెప్పినా వినేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. మీరు అసెంబ్లీలో లేవనెత్తే ఎటువంటి సమస్యలకైనా ధీటుగా జవాబు చెబుతామని ఆయన తెలిపారు. 1000 రోజుల్లో ఎన్నో చేశాం ఇంకా చెయ్యాల్సిన పనులు రెండున్నర ఏళ్లలో పూర్తి చేస్తాం అన్నారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
బిజెపి, బిఆర్ఎస్ కార్యకర్తలు ఈ విష ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించామని, అందులో కేవలం కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే ప్రయాణం చేస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఉచిత విద్యుత్తు ఇస్తున్నామన్నారు. మీ నాయకత్వం సరిగా లేకుంటే వచ్చే పదేళ్లు బిఆర్ఎస్ను ప్రజలు రోడ్డుపైనే కూర్చోపెడుతారని ఆయన కెసిఆర్‌నుద్దేశించి అన్నారు. మంత్రి అజహరుద్దీన్ ప్రసంగిస్తూ ప్రతిపక్ష నేత కెసిఆర్ వెయ్యి రోజుల నుంచి పాం హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. అసెంబ్లీకి రావడానికి కెసిఆర్‌కు భయం అవుతున్నదా? అని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాని కెసిఆర్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ప్రసంగిస్తూ వెయ్యి రోజులుగా అసెంబ్లీకి రాని కెసిఆర్ ప్రజాధనాన్ని వృధా చేసినందుకు ప్రతిపక్ష హోదాకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ సమావేశంలో మంత్రి జి. వెంకట స్వామి, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంత రావు, ఎంపీలు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, మధుయాష్కీ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ, డిసిసి అధ్యక్షులు మోత రోహిత్, దీపక్ జాన్, సైఫుల్లా, మహిళ, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాల నుంచి కూడా అనేక మంది ఇందిరా పార్కు ధర్నా చౌక్‌కు చేరుకోవడంతో ఆ చుట్టు పక్కల ప్రాంతాలన్నీ కిటకిటలాడాయి. పోలీసులు ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ను ఇతర రూట్లకు మళ్ళించారు.













