
శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్ కోసం బిసిసిఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో కొత్త స్పిన్నర్‌కు అవకాశం దక్కింది. 33 ఏళ్ల సారాంశ్ జైన్‌ను ఎంపిక చేయడంతో.. అందరి దృష్టి ఇప్పుడు అతడిపై పడింది. అతడు భిన్నమైన ఆఫ్ స్పిన్నర్ అని.. శ్రీలంకతో టెస్టుల్లో తుది జట్టులో తప్పకుండా ఉంటాడని.. మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు.
‘‘శ్రీలంకతో తొలి టెస్టులో తప్పకుండా రవీంద్ర జడేజా ఆడతాడు. గత మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసిన మానవ్ సుతార్‌కూ అవకాశం ఉంది. ఇక కుల్దీప్ కూడా ఆడాలి. ఇప్పటికే ముగ్గురు స్పిన్నర్లు అవుతారు. ఇక సారాంశ్ జైన్‌ను ఏడో స్థానంలో తీసుకోవడం ఖాయమే. అతడు భిన్నమైన ఆఫ్ స్పిన్నర్... బ్యాటింగ్ కూడా చేయగలడు. రిషబ్ పంత్ ఐదు, శుభ్‌మాన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వస్తారు. యశస్వి జైస్వాల్ - కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తారు. సాయి సుదర్శన్, బుమ్రా ఫిట్‌నెస్ నిరూపించుకోవాలి. సాయి సుదర్శన్ లేకపోవడం జట్టుకు లోటే. అతడి స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్ ఆడతాడు. దేశవాళీల్లో మంచి ప్రదర్శనే ఇచ్చాడు. కానీ, ఫస్ ఛాయిస్ మాత్రం సాయి సుదర్శనే’’ అని అశ్విన్ అన్నాడు.











