హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై గురువారం సాయంత్రం లారీ దగ్ధమైంది. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి ఎగ్జిట్ 5 వద్ద చోటుచేసుకుంది. నడుస్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ లారీని పక్కకు ఆపి కిందకు దిగాడు. క్షణాల్లోనే మంటలు లారీ అంతగా వ్యాపించాయి. దీంతో దట్టమైన పొగతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. లారీ డ్రైవర్ సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు.